Excise minister mopidevi venkata ramana

excise, minister, mopidevi, venkata ,ramana,

excise minister mopidevi venkata ramana

3.gif

Posted: 02/08/2012 11:56 AM IST
Excise minister mopidevi venkata ramana

mopideviమద్యం సిండికేట్ల వ్యవహారం అటుతరిగి ఇటుతిరిగి పాలకుల మెడకే చుట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. స్వయానా ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణకే రూ.10 లక్షలు మామూళ్లు ముట్టజెప్పినట్టు ఖమ్మం జిల్లాకు చెందిన మద్యం వ్యాపారి నున్నా రమణ అలియాస్ వెంకటరమణ ఏసీబీ విచారణలో వెల్లడించడం అమాత్యులతోపాటు, ప్రభుత్వ పెద్దల గుండెల్లో గుబులు రేపుతోంది. ఒక్క మంత్రి మాత్రమే కాదు.. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, పలు పార్టీల నేతలతో పాటు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లు మొదలుకుని ఎస్‌ఐల దాకా మద్యం సిండికేట్ల నుంచి ఎవరెవరు ఎంత మామూళ్లు తీసుకున్నదీ రిమాండ్ డైరీలో ఏసీబీ సవివరంగా పొందుపరిచినట్టు సమాచారం.

nunna_ramanaఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ టి.పి.విఠలేశ్వర్ ఏసీబీ కోర్టుకు సమర్పించిన ఆ డైరీలో అధికార, విపక్ష, ప్రభుత్వాధికారుల జాతాకాలున్నాయి. ‘‘మహబూబాబాద్ (వరంగల్) కాంగ్రెస్ ఎమ్మెల్యే కవితకు రూ.5 లక్షలు, సత్తుపల్లి (ఖమ్మం) టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు రూ.3 లక్షలు, సీపీఐ ప్రముఖుడు పువ్వాడ నాగేశ్వరరావుకు రూ.3 లక్షలు, సీపీఐ (ఎంఎల్-న్యూ డెమోక్రసీ) నేత రంగారావుకు రూ.4 లక్షలు, సీపీఎం జిల్లా నాయకుడు సుదర్శన్‌కు రూ.3 లక్షలు, టీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శికి రూ.60 వేలు ఇచ్చాను. బీజేపీ నేతలకు కూడా ఇచ్చాను. ఖమ్మం జిల్లా ఎక్సైజ్ అధికారులతో పాటు పోలీసు అధికారులకు కూడా ముడుపులిచ్చాను’’ అని అందులో నున్నా పేర్కొన్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ ఆరోపణలను మంత్రి మోపిదేవి తీవ్రంగా ఖండించటంతో పాటు ఈ ఉదయం సీఎంను కలిసి వివరణ కూడా ఇచ్చారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Response of political leaders about excise bribe
Jayaprada leg skid  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles