Cbi jd lakshmi narayana meets cs

CBI JD Lakshmi Narayana meets CS, Vijaya Sai Reddy, B.P.Acharya's Remand report, YS Jagan,

CBI JD Lakshmi Narayana meets CS

CBI.gif

Posted: 02/01/2012 10:18 AM IST
Cbi jd lakshmi narayana meets cs

CBI JD Lakshmi Narayana meets CSవివిధ కేసుల్లో అవసరం మేరకే విచారణ చేస్తున్నాం తప్ప ఎవరినీ టార్గెట్ చేయడం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదిని కలిసి అనేక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసుల పురోగతిలో ప్రభుత్వంనుంచి కావాల్సిన సహాయంపై సిఎస్‌తో చర్చించినట్టు చెప్పారు. కొన్ని అంశాల్లో సమన్వయం కావాల్సి ఉంటుందని, అందుకోసమే సిఎస్‌ను కలిశానన్నారు. ఎమ్మార్ కేసులో ఛార్జ్‌షీట్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఓబుళాపురం కేసులో అరెస్టు చేసిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై ఛార్జ్‌షీటు దాఖలు చేసేందుకు కేంద్ర అనుమతి కోసం వేచి చూస్తున్నామన్నారు. వచ్చిన వెంటనే ఛార్జ్‌షీటు దాఖలు చేస్తామన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ నివాసం లోటస్‌పాండ్ విలువ అంచనా ఇంకా పూర్తి కాలేదన్నారు. ఇక వివిధ కేసుల విచారణ సమయంలో అవసరమైతే ఎవరినైనా విచారిస్తామని, అయితే ప్రత్యేకంగా ఎవరినీ టార్గెట్ చేయబోమని స్పష్టం చేశారు. ఎమ్మార్ కేసులో అరెస్టు చేసిన విజయరాఘవన్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని స్పష్టం చేశారు. వారు కేవలం కోర్టులో చెప్పారే తప్ప థర్డ్‌డిగ్రీ ప్రయోగం జరగలేదని స్పష్టం చేశారు. జగన్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదన్న ప్రశ్నకు సమాధామిస్తూ విచారణ కొనసాగుతోందని, అవసరాన్ని బట్టి అరెస్టులు ఉంటాయని అన్నారు.
ఇక వివిధ కేసులు, విచారణలకు సంబంధించి పత్రికల్లో వస్తున్న వార్తలు సరికాదన్నారు. ఇదే విషయాన్ని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా అన్ని పత్రికల యాజమాన్యాలకు తెలియజేశామన్నారు. అవసరమైన సమాచారాన్ని తాము చెబుతామని, అయితే ఊహాగానాలు రాస్తూ తాము లోపాయికారీగా చెప్పినట్టు వార్తలు రాయడం సరికాదన్నారు. కాగా, తాజా పరిస్థితులను సిఎస్‌కు వివరించినట్టు చెప్పారు. సోమవారం అరెస్టు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య విషయాన్ని కూడా సిఎస్‌కు వివరించినట్టు జెడి లక్ష్మీనారాయణ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Give us 5 years in uttar pradesh
All parties in ap must unite on t chidambaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles