Ordeal ends for norway nri parents uncle to get custody of kids

Ordeal ends for Norway NRI parents, uncle to get custody of kids

Ordeal ends for Norway NRI parents, uncle to get custody of kids

kids.gif

Posted: 01/26/2012 04:14 PM IST
Ordeal ends for norway nri parents uncle to get custody of kids

Ordeal ends for Norway NRI parents, uncle to get custody of kids

స్థానిక చట్టాల ధాటికి కన్నబిడ్డలకు దూరమై, కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఎన్నారై జంట సాగరిక, అనురూప్‌లకు ఎట్టకేలకు ఊరట లభించబోతోంది. ప్రస్తుతం నార్వే చైల్డ్ వె ల్ఫేర్ సర్వీసెస్ కస్టడీలో ఉన్న వీరి పిల్లలు రెండున్నరేళ్ల అభిజ్ఞాన్, ఆర్నెల్ల పసికందు ఐశ్వర్యలను అనురూప్ సోదరుడు అరుణభాస్‌కు అప్పగించేందుకు అంగీకారం కుదిరింది. నార్వేలోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధి, నార్వే మున్సిపాలిటీ, చైల్డ్ కేర్ సర్వీసెస్, తల్లిదండ్రులు సాగరిక, అనురూప్‌లమధ్య ఈమేరకు ఒప్పందం కుదిరింది. కోర్టు వెలుపల కుదిరిన ఈ ఒప్పందాన్ని కోర్టు ధ్రువీకరించాల్సి ఉంది. దీని ప్రకారం పిల్లల్ని అరుణ్‌భాస్ తనతోపాటు కోల్‌కతా తీసుకొచ్చేస్తారు. ఆ పిల్లల బాగోగుల్ని ఇకపై ఆయనే చూడాలి. ఇందుకు అరుణ్‌భాస్ అంగీకరించారని ఒప్పందం పేర్కొంది. నార్వే చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్ కూడా ఇందుకు అంగీకరించింది. సాగరిక, అనురూప్‌లకు తల్లిదండ్రులుగా ఆ పిల్లల్ని కలుసుకునేందుకు మాత్రమే హక్కులుంటాయి. నార్వే కుటుంబ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందం సక్రమంగా అమలవుతున్నదీ లేనిదీ చూస్తుంటుందని ఒప్పందం పేర్కొంది. పిల్లల బాగోగుల గురించి అడిగినప్పుడల్లా ఆ శాఖకు సమాచారం అందించాల్సిన బాధ్యత అరుణ్‌భాస్ కుటుంబానిదే. అభిజ్ఞాన్, ఐశ్వర్యల సంక్షేమంపై మన ప్రభుత్వం తరఫున రాయబార కార్యాలయం గ్యారంటీ ఇచ్చింది. అరుణభాస్ నార్వే వెళ్లేందుకు అవసరమైన ఖర్చుల్ని మన ప్రభుత్వం భరిస్తోంది.

తల్లిదండ్రులిద్దరూ పిల్లలకు చేత్తో ఆహారం తినిపిస్తున్నారని, తమతోపాటు మంచంపై నిద్రపుచ్చుతున్నారని, వారికి కొనిచ్చిన ఆటబొమ్మలు కూడా వయసుకు తగ్గట్టుగా లేవని.. ఇలా చేయడం పిల్లలను సరిగా పెంచకపోవడం కిందికొస్తుందని పేర్కొంటూ అభిజ్ఞాన్, ఐశ్వర్యలను వారినుంచి నార్వే అధికారులు వేరుచేసి శిశు సంక్షేమ కేంద్రాల్లో చేర్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం వారిద్దరూ 18 ఏళ్ల వయసు వచ్చేవరకూ అక్కడే పెరగాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఏడాదికి రెండుసార్లు గంటచొప్పున మాత్రమే కలిసే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనలతో దిగ్భ్రాంతిచెందిన తల్లిదండ్రులు తమ పిల్లల్ని అప్పగించమంటూ ఆరు నెలలుగా కోర్టుల్లో పోరాడుతున్నారు. తమ వీసా గడువు ఈ మార్చితో ముగియబోతుండటంతో వారిలో ఆందోళన రెట్టింపయింది. ఎందుకంటే, ఆ తర్వాత పిల్లల్ని వెనక్కి తెచ్చుకోవడం మరింత క్లిష్టంగా మారుతుంది. తాజా ఒప్పందం పిల్లల బాధ్యతను తమకు అప్పగించకపోయినా వారిద్దరూ నార్వే చెరనుంచి బయటపడుతున్నారని, తమకు అది చాలని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాము ఇక్కడికొచ్చాక పిల్లల్ని దగ్గరుంచుకోవడంలో ఎలాంటి సమస్యా ఉండబోదని విశ్వసిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dsp terminated from service
Peddapalli civil judge subba rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles