Dsp terminated from service

DSP terminated from service, Deputy superintendent of police, P Venkata Ratnam, was relieved from her duties on Wednesday on corruption charges

DSP terminated from service

DSP.gif

Posted: 01/26/2012 04:21 PM IST
Dsp terminated from service

DSP terminated from service

ఇంకా ఆమె శిక్షణ కూడా పూర్తి కాలేదు. ఉద్యోగంలో చేరిన రెండు నెలలకే రెండు చేతులా సంపాదించాలనుకుంది. ఉడుకు నెత్తురుతో సంఘ విద్రోహుల పని పట్టాల్సిన ఆమె.. భూకబ్జాకోరులతో కుమ్మక్కైంది. కేవలం రెండే రెండు నెలల్లో డిస్మిస్ అయ్యింది. మెదక్ జిల్లా రామచంద్రాపురం ప్రొబేషనరీ డీఎస్పీ భల్లా వెంకటరత్నం! భూ వివాదాల్లో తలదూర్చిన వెంకటరత్నాన్ని ఉద్యోగం నుంచి డీజీపీ దినేశ్ రెడ్డి డిస్మిస్ చేశారు. అవినీతి కేసులో డీఎస్పీ స్థాయి అధికారిని ఉద్యోగం నుంచి తప్పించడం ఇదే మొదటిసారి. రామచంద్రాపురం సబ్ డివిజన్లో 14 ఎకరాల భూ వివాదంలో వెంకటరత్నం తలదూర్చారు. ఒక వర్గానికి వత్తాసు పలికి.. మరో వర్గాన్ని బెదిరించారు. దీంతో, బాధితులు నేరుగా డీజీపీకే ఫిర్యాదు చేశారు.

ఆరోపణలన్నీ విచారణలో వాస్తవమని రుజువయ్యాయి. ఇంకా శిక్షణలోనే ఉండడంతో వెంటనే ఆమెను డిస్మిస్ చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. ఓవైపు రాష్ట్రపతి పతకాలను సాధించిన పోలీసు అధికారులను అభినందిస్తూనే.. అదేరోజు మహిళా డీఎస్పీని ఉద్యోగం నుంచి తప్పించడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. 'ప్రతిభ చూపిన వారికి పతకాలు వచ్చాయి. చేయి చాచిన వారికి యూనిఫాం ఊడింది'' అని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.
ఉద్యోగంలో కొత్తగా చేరిన వారైతే నిజాయితీగా పని చేస్తారని అందరికీ సబ్ డివిజన్లు ఇచ్చామని ఇటీవల డీఎస్పీలకు పోస్టింగుల సందర్భంగా డీజీపీ దినేశ్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కానీ, ఉద్యోగంలో చేరిన రెండు నెలలకే తన నమ్మకాన్ని వమ్ము చేసినందుకే ప్రభుత్వ అనుమతితో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Uk government launching a new scheme
Ordeal ends for norway nri parents uncle to get custody of kids  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles