Shoe thrown at rahul gandhi

Uttarakhand Polls, Polls 2012, Rahul Gandhi, Congress, Shoe thrown

A shoe has been thrown at Congress General Secretary and Amethi MP Rahul Gandhi during an election rally in Dehradun. One person has been detained for throwing the shoe

shoe attack on rahul.GIF

Posted: 01/23/2012 08:26 PM IST
Shoe thrown at rahul gandhi


    Rahul-Shoeకాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ రాహుల్ గాంధీపై బూటు విసిరాడో యువకుడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో ఈ అపస్రుతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికాస్ నగర్ లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ పై ఓ యువకుడు షూ విసిరాడు. దీంతో ఒక్కసారిగా ఖిన్నులైన భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ హడావిడిలో అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు  ఆ యువకునిపై దాడికి యత్నించారు. అయితే రాహుల్ గట్టిగా అరుస్తూ అతన్ని ఏమీ చేయకండని చెప్పటం విశేషం.

  గతంలోనే ఈ సంస్క్రుతికి తెరలేచినప్పటికినీ ఈ మధ్య కాలంలో అంటే 2008 లో అప్పటి అమెరికా ప్రధాని జార్జి డబ్ల్యూ బుష్ మీద ఇరాకీ జర్నలిస్ట్  మౌన్తధర్ అల్ జియాది నూరి బూటు విసిరి సంచలనం రేకెత్తించింది మొదలు, మన జాతీయ నేతలపైనా చెప్పులు విసురుడు కొనసాగుతోంది. ఈ బాధితుల్లో  మన ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు, బీజేపీ సీనియర్ నేతల అద్వానీ, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం, శరద్ పవార్, అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, నవీన్ జిందాల్, ఒమర్ అబ్దుల్లా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా రాహుల్ గాంధీకూడా ఈ లిస్ట్ లో చేరిపోయారు.

…avnk      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  116th birth day of netaji subash chandra bose
Bank cheque  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles