Photographer homai vyarawalla passes away

Photographer Homai Vyarawalla passes away, India's first woman photo,

Homai Vyarawalla's passing marks the end of an era of a full and rich life lived with dignity and strength. She was the pioneering woman who ,Photographer Homai Vyarawalla passes away

Homai Vyarawalla.gif

Posted: 01/17/2012 11:10 AM IST
Photographer homai vyarawalla passes away

Photographer Homai Vyarawalla passes away

తన కెమెరాలో ఎన్నో అపూర్వ దృశ్యాలను బంధించి ప్రపంచ ఖ్యాతి గడించిన భారతీయ తొలి మహిళా ఫొటో జర్నలిస్టు హొమై వ్యారవల్లా ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుజరాత్లోని వడోదరలోని ఓ ప్రైవేటు ఆస్పవూతిలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1913లో గుజరాత్లోని నవసరీలో జన్మించిన వ్యారవల్లా 1930 నుంచి ఫొటో జర్నలిస్టుగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆడవారు ఇళ్లు విడిచి బయటకు రాలేని నాటి పరిస్థితుల్లోనూ ఆమె ఎంతో సాహసంగా ఫొటో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. 


స్వాతంత్య్ర పోరాట దృశ్యాలతో పాటు, మహాత్మా గాంధీ, నెహ్రూ వంటి మహానుభావుల ఛాయచివూతాలను వ్యారవల్లా తన కెమెరాలో బంధించారు. రాణి ఎలిజిబెత్-2, అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసన్ ఓవర్ల భారత పర్యటనలను కూడా చిత్రీకరించారు. ముంబై, ఢిల్లీల్లోని పలు పత్రికల్లో ఆమె తీసిన ఫొటోలు ప్రముఖంగా ప్రచురితమయ్యేవి. మహాత్మాగాంధీ అంతిమయావూతకు సంబంధించి వ్యారవల్లా తీసిన ఫొటోలు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తాయి. నాలుగు దశాబ్దాల పాటు అలుపెరగకుండా ఫొటో జర్నలిస్టుగా ఆమె ప్రస్థానాన్ని సాగించారు. 1970లో భర్త చనిపోవడంతో వృత్తికి స్వస్తిచెప్పారు. వ్యారవల్లా అంతిమయాత్ర వడోదరలోని ఖాస్వాడి శ్మశాన వాటికలో జరిగాయి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తన సంతాపాన్ని ట్విట్టర్లో తెలిపారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  State govt to start new welfare programs from medak dist
Sonia gandhi in uttarakhand campaign  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles