ముంబైలో అన్నా కార్యక్రమం విఫలమైందా అంటే ఔననే అంటున్నారు చాలా మంది. అన్నా బృందం ఏం చెప్పినా, ముంబై లో మూడు రోజులు నిరాహార దీక్ష ప్రారంభించిన అన్నా హజారే బహిరంగ సభకు చాలా తక్కువ మంది హాజరవటం నిరాశాజనకమే అయింది. ఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో మొదటిసారిగా అన్నా నిర్వహించిన కార్యక్రమానికి జనం పట్టలేదు. నిలుచోవటానికి కూడా చోటు లేకుండా ఉంది. కానీ ముంబైలో జరిగిన కార్య క్రమంలో అంతా ఖాళీ ఖాళీగా కనిపించింది. అన్నా ఆకర్షణ తగ్గిందా లేకపోతే లోక్ పాల్ పాత పాటైపోయిందా, దీనికి కారణమేమిటని విశ్లేషకులు విచారించి ఈ క్రింది విషయాలను కారణాలుగా పరిగణించారు.
1. అన్నా మొదటిసారి నిరాహార దీక్ష చేసినప్పుడు అది ఎంత కాలమన్న కాలపరిమితి లేదు. జనంలో సానుభూతి ఎక్కువగా ఉంది. ఎప్పటి కప్పుడు అన్నా దీక్షకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అని ఎదురు చూసారు. కానీ ఈసారి 3 రోజుల కాల పరిమితి నిర్ణయించటంతో ఆ ఉత్కంఠ లేదిప్పుడు.
2. ఒకపక్క లోక్ సభలో చర్చలు జరుగుతుండగా అక్కడేం జరుగుతుందని చూడటం లోనే దేశవాసుల ఆసక్తి నెలకొనుంది. అక్కడ జరిగేదంతా టివిల్లో చూడటానికే ఎక్కువ మంది మొగ్గు చూపించారు.
3. క్రిస్మస్ శలవుల వలన ఊళ్ళకెళ్ళినవారు చాలా మంది ఉన్నారు.
4. ఢిల్లీ లో రామ్ లీలా మైదాన్ నగరం నడిబొడ్డునుండి బస్సులలో రాకపోకలకు అనుకూలంగా ఉంది. కానీ ముంబైలో ఎమ్ఎమ్ఆర్డిఏ మైదానం చేరుకోవటానికి బస్సు సదుపాయం లేదు. అందుకు ప్రత్యామ్నాయంగా అన్నా బృందం బాంద్రా నుంచి రావటానికి బస్సులను ఏర్పాటు చెయ్యటం కూడా విమర్శలకు దారితీసింది.
లోక్ పాల్ బిల్లు కోసం కాంగ్రెస్ పార్టీనే తప్పు పట్టటమెందుకని, భాజపా వైఖరి కూడా తేటతెల్లమైంది కదా, అని కాంగ్రెస్ నేతలనుంచి విమర్శలు వచ్చాయి. చూసారా అన్నా ఉద్యమం అవినీతి మీద పోరాటం కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకుని చేస్తున్నారు. ఇది రాజకీయమే కానీ ఉద్యమం కాదు అంటూ రాజ్యసభ సభ్యురాలు అంబికా సోనీ ధ్వజమెత్తారు.
కారణాలు ఏమైనా, జనం చాలా తక్కువమంది హాజరయ్యారన్నది సత్యం. అయితే దీన్ని అన్నా వైఫల్యమనటానికి వీల్లేదు. ప్రాణాలు పోయినా సరే ఉద్యమిస్తానన్న వ్యక్తి జ్వరానికే భయపడితే ఎలా అనే విమర్శ సరికాదు. అన్నా ఉద్యమించబట్టే లోక్ పాల్ ఈమాత్రమైనా కదిలిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఆఘమేఘాల మీద ముసాయిదాలు తయారు చేసి, దాని మీద మల్లగుల్లాలు పడి, సభా సమయం అయిపోయినా కాలాన్ని పొడిగించి మరీ బిల్లుని ప్రవేశపెట్టి చర్చలు వరకూ తీసికెళ్ళి పార్లమెంటు నుంచి పాస్ చేసి రాజ్య సభకు పంపారంటే అది కేవలం అన్నా హజారే చేసిన ఒత్తిడే అందుకు కారణమని ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more