Krishna reddy statement about revival of party

Prajarajyam MLA Sridhar Krishna Reddy statement about revival of party created sensation political circles.chiranjeevi, prajarajyam, congress, krishna reddy

Prajarajyam MLA Sridhar Krishna Reddy statement about revival of party created sensation political circles.chiranjeevi, prajarajyam, congress, krishna reddy

MLA Sridhar Krishna.GIF

Posted: 12/23/2011 10:20 AM IST
Krishna reddy statement about revival of party

Chiranjeevi‘అలస్యం అమ్రుతం – విషం’ అనే సామెత మెగాస్టార్ చిరంజీవికి ఇప్పుడిప్పుడే అర్థం అయినట్లు కనబడుతుంది. ప్రజలకు సేవ చేద్దామని అనుకున్న చిరంజీవి ప్రజల అభీష్టం మేరకు పార్టీని స్థాపిస్తానని ప్రకటించాడు. అప్పడు కొన్ని కారణాల వల్ల పార్టీ స్థాపన ఆలస్యం అయింది. దీంతో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసి చూసి అభిమానులు కొంత అసంతృప్తికి లోనయిన విషయం తెలిసిందే. ఆలస్యం అయినా ఆఘమేఘాల మీద పార్టీని స్థాపించిన చిరంజీవి, అంతే ఆఘమేఘాల మీద తొందర పడి పార్టీని మహాసముద్రంలో కలిపి నట్లు కాంగ్రెస్ లో కలిపాడు.

అంత వరకు భాగానే ఉన్నా చిరంజీవికి ఆ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలస్యంగా అర్థం అవుతుంది. ఆపదలో ఉన్నప్పుడు పార్టీని ఆదుకున్న చిరంజీవికి పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో ఆయనకు సహనం నశించిందో లేక తన ప్రతాపం ఏంటో చూపించాలనుకున్నాడో కానీ ఒక్కసారిగా కొత్త మంత్రం జపిస్తున్నాడు. ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరిస్తారా అనే అనుమానాలు ఒక్కసారిగా ముందుకు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ నెల్లూరు జిల్లా శానససభ్యుడు శ్రీధర్ కృష్ణారెడ్డి కొత్త వాదనను తెర మీదికి తెచ్చారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమని, పార్టీ పునరుద్ధరణ కూడా జరగవచ్చునని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది.
అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు లైట్ తీసుకుంటున్నారు. కేవలం బెదిరించడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, జేసీ దివాకర్ రెడ్డి వంటి నాయకులు అయితే ఏకంగా పీఆర్పీని పునరుద్దరించలేరని అంటున్నారు. ఏది ఏమైనా చిరుకు కాంగ్రెస్ గురించి లేటుగా అర్థం అయినయినందుకైనా సంతోషిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali janardhan reddy as financial terrorist
Kvp ramachandra rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles