పార్లమెంటులో మరోసారి భగవద్గీత సంచలనం రేపింది. హిందువులు అతి పవిత్రంగా చూసే భగవద్గీతను నిషేధించటమంటే మనందరిని అగౌరవపరచినట్లే నని భాజపా సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ అన్నారు. మరెవరూ ఇలాంటి సాహసానికి పూనుకోకుండా ఉండటం కోసం భగవద్గీతను మన దేశ గ్రంథంగా ప్రకటించాలని ఆమె కోరారు. దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి ఎస్ ఎమ్ కృష్ణ మాట్లాడుతూ, ఇప్పటికే రష్యా ప్రభుత్వంతో మాట్లాడటం జరిగిందని, తాము అన్ని మతాలనూ గౌరవిస్తామని వారు చెప్తూ, ఎక్కడో ఏదో పొరపాటు జరిగివుంటుంది, ఏ నివేదికలోనో తప్పు దొర్లివుంటుందని, అటువంటి గ్రంథాన్ని నిషేధించటం జరగదని మాటిచ్చారని అన్నారు. ఏ కాలంలోనే ఆచరణీయ యోగ్యమైన సందేశాలను, పరమ సత్యాలను మానవాళికి మార్గదర్శకాలను సూచించిన భగవద్గీత మన దేశ పవిత్ర గ్రంధమని, రష్యానుంచి తప్పక సానుకూలమైన నిర్ణయం వెలువడుతుందని ఆయన అనగా సభలో సభ్యులనుంచి కరతాళ ధ్వనులు పార్లమెంటులో మారుమోగాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more