Bsnl employees

BSNL Employees.GIF

Posted: 12/17/2011 09:42 AM IST
Bsnl employees

రాష్ట్రంలో కిరణ్ ప్రభుత్వం లక్షమందికి ఉద్యోగాలిస్తామని హామీల మీద హామీలు ఇస్తు నోటీఫికేషన్లు జారీ చేస్తుంది. కానీ అందుకు భిన్నంగా కేంద్రం లక్షమందిని సాగనంపడానికి అస్ర్తాలు సిద్దం చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులను వీఆర్ఎస్ (స్వచ్చంద పదవీ విరమణ) పేరుతో లక్ష ఉద్యోగాలకు శఠగోపం పెట్టాలని చూస్తుంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌లో 2 లక్షల 77 వేల మంది ఉద్యోగులు ఉన్నారని, వారిలో లక్ష మందికి విఆర్‌ఎస్‌ పరిధిలోకి తీసుకుని రావాలని నిర్ణయించామని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌ కె ఉపాధ్యయ అన్నారు. సంస్థకు వస్తోన్న ఆదాయంలో 48 శాతం వేతనాలకే సరిపోతున్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
 లక్ష మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని,  టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ సిబ్బంది కూడా ఇందులో ఉన్నారని చెప్పారు. గ్రామాల్లోని టెలిఫోన్‌ ఎక్స్ఛేంజీల నిర్వహణను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ఆయన సూత్రప్రాయంగా చెప్పారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan team
Ipod touch and going on planes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles