Ministers committee meeting

Leaders, quit, costal Andhra, AP ministers, skip, Cabinet meeting, video, sharing, camera phone, video phone, free, upload

Leaders, quit, costal Andhra, AP ministers, skip, Cabinet meeting, video, sharing, camera phone, video phone, free, upload

ministers committee meeting.GIF

Posted: 12/08/2011 10:24 AM IST
Ministers committee meeting

ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ప్రజలకు సేవ చేయడం మానేసి తనకు ఏ సౌకర్యాలు కావాలో చూసుకుంటుంన్నారు. మొన్నటికి మొన్న ఎంపీలకు లక్షల్లో జీతాలు, అదనపు సౌకర్యాలతో పాటు ఐ ప్యాడ్ లు వంటి రాజభోగాలు అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఎంపీలు అన్ని అనుభవిస్తుంటే తాము ఏమన్న తక్కువ  తిన్నామా అన్నట్లు మన రాష్ట్రమంత్రులు, గవర్నర్ అనుకున్నారేమో... మంత్రుల కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నరు, మంత్రులకు కొత్తకార్లు.... న్యూఢిల్లీలో ఎపీ భవన్ కు రూ. 9 కోట్లతో హంగులు... మంత్రుల కోసం డైనింగ్ హాల్... ఏర్పాటు చేయాలని చకచకా నిర్ణయాలు తీసుకున్నారు.  మంత్రులు ధర్మాన, రఘువీరా, పొన్నాల, ఆనం ఈ భేటీలో పాల్గొన్నారు.
రూ. 9 కోట్ల వ్యయంతో ఏపీ భవన్ లోని మూడు బ్లాకుల్లో ఆధునీకరణ పనులు చేపట్టి, మార్చిలోగా పూర్తి చేయాలని, క్యాంటీన్ కు కొత్త కాంట్రాక్టర్ ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. అవిశ్వాసంలో నెగ్గినందుకే మంత్రులకు, గరవర్నర్ లకు ఈ బహుమతి ఇస్తున్నారని అంటున్నారు.
ఈ నిర్ణయం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామన్య ప్రజలకు తినడానికి తిండే సరిగా లేదు, మేము వేసిన ఓట్లతో గెలిచిన మీకు రాజభోగాలు కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs agitation over cheruku sudhakar arrest under nasa
Minister shankar rao press meet at clp office  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles