శాసన సభలో అవిశ్వాస తీర్మానం లభిస్తుందో లేదో కానీ అసలు ప్రతిపాదన ఎంత వరకూ ముందుకెళ్తుందో అన్నది కూడా ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. అవిశ్వాస నోటీసు ఇచ్చిన తెదేపా ఈ రోజు ఉదయం దాని మీద పక్కా హామీ ఇవ్వాలని పట్టుపట్టడంతో సభ కాస్తా వాయిదా పడింది. అవిశ్వాసం తప్పక ప్రవేశపెడతామని, దానితో ఎవరు ఎటువైపున్నారో తేలిపోతుందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు చెప్తూ వచ్చారు కానీ, తెరాస ఎటువైపుంటుందో తేలని పరిస్థితి కనిపిస్తోంది. దానికి వారి ఆయుధం శాసన సభలో తెలంగాణా ఏర్పాటు ప్రతిపాదన. అది జరగనంత వరకూ వేరే ఏమీ జరగనివ్వమని తెరాస పట్టుపడుతోంది. దానితో అవిశ్వాస తీర్మానం ముందుకు నడిచే మార్గం కనపడటం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా అవిశ్వాసం ఎందుకు పెట్టటం లేదని, కాంగ్రెస్ తో కుమ్ముక్కవటమే అందుకు కారణనమని అంటూ వస్తున్న తెరాస నాయకులు, తెదేపా తయారయ్యేటప్పటికి అవిశ్వాస నోటీసు ఇస్తే మేం సభలో మద్దతునిస్తామని చెప్తున్నా, ఇప్పుడు తీరా ఇచ్చిన తర్వాత తెలంగాణా అంశంతో పీట ముడి వేస్తున్నారు. శాసన సభను స్తంభింప జేయటానికి తెలంగాణా కాంగ్రెస్ శాసనసభ్యుల మద్దతు కూడా కోరుతున్న తెరాస నాయకుడు హరీష్ రావు, మీ ఎంపీలే అధిష్టానాన్ని పట్టించుకోనప్పుడు శాసన సభ్యులుగా మీరూ మాతో కలిసి రావొచ్చని వారికి నచ్చజెప్తున్నారు.
మాకు తెలంగాణాయే ముఖ్యం. ముందు దానిమీద ప్రభుత్వం తీర్మానం చేస్తేనే మిగతా చర్చలు అనటంతో, తెదేపా ఇరుకునపడుతోంది. ఒకవేళ ఆ ప్రస్తావనే ముందు వస్తే, అందుకు సీమాంధ్ర నేతలు సుముఖంగా లేరు. అది జరగకపోతే తెలంగాణా ద్రోహులని ముద్ర వేసి, అందుకు ప్రతిగా తెదేపా ప్రతిపాదనకు మద్దతునివ్వకుండా ఉండటానికి అవకాశం ఉంది.
పిటిషన్ యుద్ధాలు సాగుతున్నా, అవిశ్వాసం విషయంలో మద్దతునిస్తామని వైయస్ ఆర్ కాంగ్రెస్ తరఫున పిల్లి సుభాష్ చంద్ర బోస్ అన్నారు. నిజంగానే వైయస్ ఆర్ కాంగ్రెస్ సభ్యులు, తెరాస సభ్యులు మద్దుతనిస్తే అవిశ్వాసం గెలుస్తుంది. కానీ ఆ తర్వాత ఏమిటన్నది మరో ప్రశ్న. ఎన్నికలకు తెదేపా పూర్తిగా తయారుగా లేదు. పైగా అధినాయకుడి తలమీద హైకోర్టు ఆదేశాల మీద విచారణ సన్నని దారంతో వేలాడదీసిన కత్తుల్లా కనిపిస్తున్నాయి.
ఇలా మిత్రభేదం జరగటంతో లాభపడుతున్నది ప్రస్తుతానికి కాంగ్రెసే పార్టీయే. కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్లెంలా గుచ్చుకుంటున్న వైయస్ఆర్, తెరాసలు ప్రధాన ప్రతి పక్షమైన తెదేపా, ఈ మూడు వర్గాలకూ మధ్య పొంతన లేకపోవటమే కాదు పరస్పరం అభియోగాలు, అవి దాటి పోయి ఏకంగా కోర్టు ద్వారా విచారణల వరకూ పోయిన సందర్భంలో నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని తన బలాన్ని పెంచుకునే దిశగా ఆలోచించగలిగే స్థితిలో ఉన్నది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more