Bandh in vizag with acb raids on mining officer

bandh in vizag, ACB raids on mining officer, 24-hour bandh called in Vizag, 72 Hours Bandh In Vizag By YSRCP, YSRCP vs TDP, ACB raids,

bandh in vizag, ACB raids on mining officer, 24-hour bandh called in Vizag

బంద్ లో పార్టీల ఘర్షణలు-ఏసీబీ సోదాలు

Posted: 10/04/2013 01:23 PM IST
Bandh in vizag with acb raids on mining officer

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళనలతో అట్టుడుకుతోంది.ఎన్జీఓలతో పాటు వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో సంపూర్ణ బంద్ జరుగుతోంది. ఈ రోజు ఉదయం నుంచి నగరంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉద్యమకారుల కమిటీల ఏర్పడి ఎక్కడికక్కడ రాకపోకలను స్తంభింపజేశారు. జగదాంబ జంక్షన్ , కలెక్టరేట్, అశీల్ మెట్ట జంక్షన్ , సత్యం కూడలి, మద్దిలపాలెం, తదితర ప్రాంతాల్లో రోడ్లపై టైర్లకు నిప్పు పెట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు పూర్తిగా మూత పడ్డాయి.

 

విశాఖలో పార్టీల మద్య ఘర్ణణలు

విశాఖ జగదాంబ సెంటర్ లో తెదేపా, వైకాపా వర్గీయుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తెదేపా ఆద్వర్యంలో చేపట్టిన ర్యాలీని వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. ధీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. ఆందోళనకారులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.

 

ఏసీబీ సోదాలు

విశాఖ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఇంట్లో ఏసీడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖలోని సుబ్రహ్మణ్యం బంధువుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more