సాధారణంగా పెళ్లైన ప్రతి ఒక జంట మొదటి రెండు, మూడు సంవత్సరాల వరకు సుఖసంతోషాలతో అన్నోన్యంగా కలిసిమెలిసి వుంటారు. కానీ ఆ తర్వాత ఒకరికొకరి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడుతాయి. ప్రతి ఒక చిన్న విషయానికి గొడవపడుతారు. దీంతో వారి దాంపత్య జీవితం ప్రమాదంలో వుండడమే కాక, వారి పిల్లలపై కూడా అది ప్రభావం చూపుతుంది. ఒకరిమీద ఒకరు నమ్మకాన్ని కోల్పోయి దూరం అవుతారు. మరికొందరైతే తమ ప్రాణాలను తీసుకోవడానికి కూడా సిద్ధపడతారు.
ఇటువంటి సంఘటనలు మన సమాజంలో చాలావరకు వెలుగులోకి వచ్చాయి. భర్త భార్య మీద అనుమానం పడడం లేదా భార్య భర్త మీద అనుమానం పడడం వంటి కేసులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువయిపోయాయి. మరికొందరైతే ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుని కూడా రెండు, మూడు నెలలకే విడాకుల కోసం కోర్టులో నిలబడుతున్నారు. ఒకరిమీద ఒకరు అనుమానాలు వ్యక్తం చేస్తూ తమ దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
అలాకాకుండా వుండాలంటే.. మొదట ఒకరిమీద ఒకరిగా నమ్మకం వుండాలి. దాంపత్య జీవితంలో నమ్మకంగా వుండడమే సుఖసంతోషాలతో కూడిన జీవితం గడపడానికి దోహదం చేస్తుంది. భర్త తన భార్యకు ఎల్లప్పుడూ తోడుగా వుంటూ, తనతో ఎక్కువ సమయం కేటాయించి దగ్గరవ్వాలి.
ఆమె ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. వారితో మీరు నమ్మకంగా వుండేలా చూసుకోవాలి. ఆమె కూడా మీమీద అనుమానం పడకుండా, నమ్మకంగా వుండేలా మనం వ్యవహరించాలి.
సుఖదు:ఖాలు ప్రతిఒక్కరి జీవితంలో సర్వసాధారణమే. అలాంటప్పుడు మనం ఒక మంచి స్నేహితుడిని వెతుక్కుంటాం. వారు కూడా మన అవసరాలకు అనుగుణంగా మనకు తోడునిస్తారు. మన మనసు లోతుల్ని అర్థం చేసుకొని మన సుఖదు:ఖాల్ని వారు పంచుకుంటారు.
కష్టసమయాల్లో మనకు ఆసరాగా వుంటారు. వారు చెప్పిన బాటలో నడవడానికి మనం ప్రయత్నిస్తాం. అలాంటప్పుడు అదే స్నేహితుడు మనం జీవితంలో భాగస్వామి రూపంలో దొరికితే.. ఇక అక్కడ ఆనందానికి హద్దు అనేదే వుండదు. కాబట్టి భర్త ఎప్పుడూ తన భార్యతో అన్నోన్యంగా, ఒక మంచి స్నేహితుడిలాగా వుండాలి.
వారితో మన కెరీర్ కుగానీ, ఇంటి సమస్యల గురించి సంబంధించిన విషయాలు గానీ ఇద్దరు కలిసి చర్చించుకోవాలి. పరస్పర నిర్ణయాలను, సలహాలను ఒకరినొకరు గౌరవించుకుని వాటిని స్వీకరించాలి. అప్పుడే దాంపత్య జీవితంలో ఒకరిమీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది.
భర్త తన భార్య అవసరాలను తెలుసుకోవడమే కాకుండా, వీలైనంతవరకు వారికి తీర్చేలా చూడాలి. వారిపట్ల సంతోషంగా మెలగాలి. వారి ఆరోగ్య సంబంధిత విషయాల గురించి కూడా తెలుసుకోవాలి. కొంతమంది భర్తలైతే ఆడవాళ్లను ఇంటిపనులకే మాత్రమే పరిమితం చేస్తారు. వారి గురించి పట్టించుకోకుండా, వారి కోర్కెలకు తీర్చకుండా తమ పనిలో తాము మునిగిపోతారు.
తనకు సంబంధించిన విషయాలను, అవసరాలను పట్టించుకోకుండా వదిలేస్తాడు. ఆడవాళ్లు దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. వ్యక్తిగత జీవితంలో మగవాళ్లు, ఆడవాళ్లకు భారం అనిపించకూడదు. వారికి కూడా స్వేచ్ఛగా జీవించే అధికారం వుంది. కాబట్టి వారికి సమానమైన గౌరవాన్ని ఇవ్వాలి.
భార్యలు కూడా తమ భర్తలతో ప్రతి చిన్న విషయం కోసం అలగటం, గొడవ పడటం వంటివి చేయకూడదు. భార్యగా తన బాధ్యతలు నిర్వర్తించే భర్తకు తనదైన సహాయాన్ని అందించాలి. ఈ విధంగా భార్యాభర్తలిద్దరూ ఎప్పటికప్పుతూ తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటే వారి దాంపత్య జీవితం సుఖంగా, యవ్వనంగా గడుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Apr 25 | ప్రేమ... ప్రస్తుతకాలంలో ఇది కంప్యూటర్ లో వైరస్ పాకిపోయినట్లుగా ప్రపంచం నలుమూలలా వ్యాపించిపోయింది. 7వ తరగతి నుంచి విద్యార్థివిద్యార్థినులు ప్రేమించుకుంటున్నామంటూ తమ పెద్దలనే ఎదురిస్తుంటారు. ప్రేమిస్తున్నవారికి ఎలాగైనా దక్కించుకోవాలని తమ ఇంట్లోవున్నవారిగురించి, వారి ప్రేమను... Read more
Apr 22 | సాధారణంగా అబ్బాయిలు తమ మనసులోని భావాలను ప్రియురాలికి వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ప్రియురాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం, ప్రతి రోజూ ఆమెను వెంబడించడం, ప్రేమ లేఖలు రాయడం, తనకు నచ్చిన గిఫ్ట్... Read more
Apr 09 | సాధారణంగా ప్రేమ వ్యవహారాలు స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు. ఇటువంటి వ్యవహారాలు... Read more
Apr 05 | ప్రస్తుతకాలంలో ప్రేమ అనే విషయం సర్వసాధారణం అయిపోయింది. పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు ఎవరినిపడితే వారిని ప్రేమించేసుకుంటున్నారు. ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే చాలు... అప్పటికప్పుడే వెళ్లి ఐ లవ్ యూ చెప్పేస్తారు. అదేవిధంగా... Read more
Apr 02 | సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు ముందు అది స్నేహంగా మారుతుంది. క్రమక్రమంగా వారితో నిత్యం కలుస్తుండడం, మాట్లాడుతుండడంతో అది ప్రేమగా మారిపోతుంది. అలా వారిమధ్య ప్రేమ చిగురించి, తరువాత పెళ్లి చేసుకుంటారు. ... Read more