సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు ముందు అది స్నేహంగా మారుతుంది. క్రమక్రమంగా వారితో నిత్యం కలుస్తుండడం, మాట్లాడుతుండడంతో అది ప్రేమగా మారిపోతుంది. అలా వారిమధ్య ప్రేమ చిగురించి, తరువాత పెళ్లి చేసుకుంటారు.
ప్రస్తుతకాలంలో ఈ సంబంధం మరీ ఎక్కువ అయిపోయింది. యువతీయువకులు ఒకరికొకరు ఆకర్షితులు అయి ప్రేమించేసుకుంటున్నారు. నేటితరంలో అయితే సహజీవనాలు కూడా చేసుకుంటున్నారు. కానీ ఇవి ఈ సంబంధాలు ఎక్కువకాలంపాటు నిలబడవు.
ప్రస్తుతరోజుల్లో యువతీయువకులు ప్రేమించుకుంటున్నామంటూ ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. నిర్ణీత అవధులు లేకుండా చేయరాని తప్పులు కూడా చేస్తున్నారు. ముందు, వెనుకా ఏమీ ఆలోచించకుండా పారిపోతున్నారు. కానీ.. నిజజీవితంలో అడుగుపెట్టిన తరువాత కష్టాలను ఎదుర్కొంటున్నారు. చీటికిమాటికి గొడవలు పడుతూ, ఎక్కువ సమస్యలను ఎదుర్కోలేక విడిపోతున్నారు.
అదేవిధంగా కొందరు ఉద్యోగస్తులు తమ ఆఫీసులోనే వుండే సహోద్యోగులతో నిత్యం కలుస్తుండడం, పరిచయాలు దగ్గరవ్వడంతో, వారిమధ్య వున్న ఇష్టాయిష్టాలను తెలుసుకోవడంతో ప్రేమించేసుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ ఆఫీసులలో ఇటువంటి ప్రేమ వ్యవహారాలు చాలా ఎక్కువగా వుంటాయి.
ఇలా సహోద్యోగులు ఒకరికొకరు ప్రేమించుకున్న తరువాత వారిమధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది. అది శారీరక సంబంధాలకు దారితీసే ప్రమాదం కూడా చాలానే వుంటుంది. ఇది సరసం కూడా కొద్దిపాటి అయినా ఫర్వాలేదు కానీ.. ఎక్కువ అయితే మాత్రం చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
ఆఫీసులోనే నిత్యం వుంటారు కాబట్టి ఖాళీ సమయంవేళ వాళ్లతో మాట్లాడటం, లంచ్ టైమ్ లో కలిసి తినడం, ఆఫీసు అయిపోయిన తరువాత కలిసి ఇంటికి వెళ్లడం జరుగుతుంది. పైగా వీకెండ్ లలో సినిమాలకు, సికార్లకంటూ తిరుగుతారు. ఇలా చేస్తూ వుండటం వల్ల అది విషాదంగా మారే అవకాశాలు వుంటాయి.
ఏదైనా ఒక చిన్న గొడవ పడి విడిపోవడం వల్ల మళ్లీ కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఇబ్బందికరంగా మారిపోతుంది. ఒకరినొకరు చూసుకోవడానికి, మాట్లాడుకోవడానికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. కాబట్టి ఆఫీసులో వున్నవారితో అఫైర్లు పెట్టుకోకపోవడమే చాలావరకు మంచిది.
ఇంకా కొన్ని మేల్కొలిపే చిట్కాలు :
1. ఆఫీసులో సహోద్యోగితోగాని, బాస్ తో గాని ప్రేమ వ్యవహారాలు సాగించినప్పుడు కొన్నిరోజులవరకు అవి తీపిగానే సాగుతాయి కానీ.. వారితో బ్రేక్ అయినప్పుడు మాత్రం అదే ఆఫీసులో తల ఎత్తుకుని తిరగడం కష్టతరమవుతుంది. నలుగురు నాలుగు విధాలుగా చెడు మాటలు మాట్లాడుకోవచ్చు. మీలో ముందున్నంత ఉత్సాహం ఒక్కసారిగా తగ్గిపోయి, పనిలో ధ్యాసను కోల్పోతారు.
2. సహోద్యోగులతో డేటింగ్ చేయడంగాని, సహజీవనం చేయడం దానికంటే ముందు మీ ఉద్యోగ వృత్తి గురించి ఆలోచించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే.. సహోద్యోగులతో మీరు డేటింగ్ చేసిన తరువాత మోసపోతే.. లేదా వారితో వివాదాలకు దిగి విడిపోతే.. ఆ ఆఫీసులో వున్నవారు చిన్నచూపుతో చూసి మిమ్మల్ని ఉద్యోగంలోను తొలగించే అవకాశాలు వుంటాయి.
3. ఉద్యోగస్తులు పరస్పరం ప్రేమించుకున్న తరువాత ఆధిపత్య ధోరణులు ప్రదర్శించకుండా సమానంగా వుంటూ.. అన్ని పనులలో ఒకరినొకరు తోడుగా వుంటే ఫర్వాలేదు. కానీ ఎవరైనా ఒకరు ఆధిపత్య ధోరణితో ప్రవర్తిస్తే విడిపోవడానికి ప్రమాదముంటుంది. దీంతో మానసికంగా దెబ్బతినే అవకాశముంటుంది.
4. సహోద్యోగులతో మంచి స్నేహంతో వుంటే వాళ్లు చాలా మర్యాదగా, గౌరవభావంతో పలకరిస్తారు. అటువంటివారితోనే ప్రేమించడంగాని, అఫైర్లు పెట్టుకోవడంగాని జరిగితే బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తారు. మీ మీద మర్యాద, గౌరవభావం ఒక్కసారిగా వారినుంచి బయటకు వెళ్లిపోతుంది. పెళ్లికాకముందు ప్రేమవ్యవహారాలు సాగిస్తే.. వారిమధ్య పటిష్టమైన బంధమనేది వుండదు.
(And get your daily news straight to your inbox)
Apr 25 | ప్రేమ... ప్రస్తుతకాలంలో ఇది కంప్యూటర్ లో వైరస్ పాకిపోయినట్లుగా ప్రపంచం నలుమూలలా వ్యాపించిపోయింది. 7వ తరగతి నుంచి విద్యార్థివిద్యార్థినులు ప్రేమించుకుంటున్నామంటూ తమ పెద్దలనే ఎదురిస్తుంటారు. ప్రేమిస్తున్నవారికి ఎలాగైనా దక్కించుకోవాలని తమ ఇంట్లోవున్నవారిగురించి, వారి ప్రేమను... Read more
Apr 22 | సాధారణంగా అబ్బాయిలు తమ మనసులోని భావాలను ప్రియురాలికి వ్యక్తపరచడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. ప్రియురాలు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం, ప్రతి రోజూ ఆమెను వెంబడించడం, ప్రేమ లేఖలు రాయడం, తనకు నచ్చిన గిఫ్ట్... Read more
Apr 09 | సాధారణంగా ప్రేమ వ్యవహారాలు స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. ఆ తరువాత తమలో వున్న భావాలను, ఇష్టాయిష్టాలను తెలుసుకుని, అనుకోకుండా ప్రేమలో పడిపోతారు. ఇటువంటి వ్యవహారాలు... Read more
Apr 05 | ప్రస్తుతకాలంలో ప్రేమ అనే విషయం సర్వసాధారణం అయిపోయింది. పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు ఎవరినిపడితే వారిని ప్రేమించేసుకుంటున్నారు. ఎవరైనా ఒక అమ్మాయి నచ్చితే చాలు... అప్పటికప్పుడే వెళ్లి ఐ లవ్ యూ చెప్పేస్తారు. అదేవిధంగా... Read more
Mar 24 | సాధారణంగా కొంతమంది అబ్బాయిలు లేదా అమ్మాయిలు... వారు ప్రేమిస్తున్న వారిని ప్రపోజ్ చేయడానికి భయపడుతుంటారు. అంతేకాదు.. వీరు తమ ప్రేమ విషయాన్ని తమ స్నేహితులకుగానీ, లేదా సన్నిహితులకుగాని అస్సలు తెలియపరచరు. ముక్కుసూటిగా చెప్పాలంటే ఇటువంటివారు... Read more