నిత్యం ఆరోగ్యంగా మెరగాలంటే జీర్ణక్రియ సక్రమంగా వుండేలా చూసుకోవాలి. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదురకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా గ్యాస్, పొట్ట ఉబ్బరం, వికారం, వాంతులు రావడం తదితర ఇబ్బందికర పరిస్థితుల బారినపడాల్సి వస్తుంది. ఈ జీర్ణ సమస్యలు తీసుకునే ఆహారంలో పోషకలోపం వుంటే వస్తాయి. కాబట్టి.. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. అందులో వివిధరకాల రసాలు (జ్యూస్) ఈ జీర్ణసమస్యల్ని దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మరి.. అవేంటో తెలుసుకుందామా..
* బేరిపండు-సెలరీ-అల్లం : ఈ మూడింటిని మిక్సీలో వేసి మెత్తగ, జ్యుస్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కాస్త తేనె వేసుకుని తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. ఈ మూడింటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది. సాధారణంగా ఫైబర్ ఎక్కువగా వుండే ఆహారాల్ని తీసుకుంటే.. పొట్టాలోని టాక్సిన్ను బయటకు నెట్టివేయబడి, జీర్ణక్రియ మెరుగవుతుంది.
* ఆపిల్-కీరదోసకాయ-లెట్యూస్ : ఈ మూడింటి మిశ్రమంతో తయారైన జ్యూస్.. మలబద్దకాన్నినయం చేస్తుంది. అలాగే పొట్ట, ప్రేగులను స్మూత్ చేస్తుంది. వీటిలో ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) ఉంటాయి. ఇవి డైజెస్టివ్ సిస్టమ్ ను హెల్తీగా వుంచడంతోపాటు దాని ట్రాక్ నుండి మలినాలను ఫ్లష్ అవుట్ చేస్తుంది. హార్ట్ బర్న్, హైపర్ అసిడిట్, గాస్ట్రిక్ కు చాలా మేలు చేస్తుంది.
* ఆరెంజ్-కలబంద-స్పినాచ్ : ఈ జ్యూస్ లో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా వుంటాయి. అవి పొట్టలో అసిడ్ శాతాన్ని పెంచుతాయి. దాని వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇది మలబద్దకాన్ని నయం చేసి డైజెస్టివ్ ట్రాక్ ను శుభ్రపరుస్తుంది. అలాగే అల్సర్, అంతర్గత రక్తస్రావంను నివారిస్తుంది. ఈ జ్యూస్ మెటబాలిజం రేటును పెంచుతుంది.
* బ్రొకోలీ-బొప్పాయి-పుదీన : జీర్ణ సమస్యలను నివారించే వాటిలో ఇది ఒక గొప్ప హోం రెమెడి. ఈ జ్యూస్ లో ఎంజైమ్ లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది. ఇందులో వుండే పుదీనా పొట్ట కండరాలను రిలాక్స్ చేస్తుంది.
* రెడ్ గ్రేప్-క్యాబేజ్-సెలరీ : ఈ జ్యూస్ డైజెస్టివ్ ట్రాక్ ను శుభ్రం చేసి, బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది. ఇది డయోరియా సమస్యకు చికిత్స వంటిది. ఇది స్టొమక్, ప్రేగు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more