The Best Herbal Tips For Good Health | Home Remedies | Health Tips

Herbal tips for good health home remedies

herbal tips, herbal tips for health, health tips, herbals health benefits, herbals benefits, tips for good health, healthy foods, healthy remedies, home remedies, health remedies

Herbal Tips For Good Health Home Remedies : The Best Herbal Tips For Good Health.

చక్కని ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు

Posted: 08/07/2015 01:04 PM IST
Herbal tips for good health home remedies

నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే పోషకాహారం రెగ్యులర్ గా తీసుకోవడంతోపాటు కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే చాలని నిపుణులు అంటున్నారు. ఈ చిట్కాలను ప్రతిరోజూ అనుసరిస్తే.. మానసిక ఆవేదన నుంచి విముక్తి పొంది.. ఉత్తేజంగా, ఉల్లాసంగా వుండటంతోపాటు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే.. వివిధ రకాల పొదలు, మూలికలు, సుగంధ ద్రవ్యాల కలయికలతో తయారయ్యే ఈ ఆయుర్వేద ఔషధాలు చాలా ప్రభావితం చేస్తాయి. దాంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ దరి చేరవు. కాబట్టి.. ఈ చిట్కాలను రెగ్యులర్ గా పాటించడం ఎంతో శ్రేయస్కరం. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* ఒక గ్లాస్ లో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, పెప్పర్, క్యాప్సికమ్, అల్లం తదితరాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా తయారుచేసుకున్న ఈ తేనీరుని ప్రతిరోజూ తాగాలి. ఇలా రెగ్యులర్ గా దీనిని తాగడం వల్ల జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. పొట్టసమస్యలు దూరవమతుతాయి.

* గాఢత ఎక్కువగా వుండే నూనెల కంటే తేలిక వుండే వాటిని ఎంపిక చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే.. అవి జీర్ణం అవ్వడానికి చాలా సులభం. మస్టర్డ్ ఆయిల్, శెనగనూనె, బట్టర్ వీటికంటే ఆయిల్ నెయ్యి, ఆలివ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ వంటివి తేలికైన నూనెలు.

* తేలికగా వుండే ఆహారాలు, జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలి. గుమ్మడి, గ్రీన్ వెజిటేబుల్స్, ఆవిరి మీద ఉడికించిన సలాడ్స్, ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్, పెసరపప్పు, కార్న్ వంటివి డైజెస్టివ్ ట్రాక్ ను చాలా సున్నితం చేస్తుంది. ఈ రకమైన ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.

* డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్, కారంగా ఉన్న ఆహారాలు, ఎసిడిక్ ఫుడ్స్, పుల్లనివి (పికెల్, పెరుగు, కర్రీస్) వంటి వాటికి దూరంగా వుండాలి. ఎందుకంటే.. వీటిలో ఉప్పు ఎక్కువ మోతాదులో వుండటం వల్ల అజీర్తి, హైపర్ అసిడిటి, కడుపుబ్బరంకు వంటి సమస్యలు ఎదురవుతాయి.

* అనేక హేర్బల్ టీలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. జింజర్ టీ, గ్రీన్ టీలు చేర్చుకోవాలి. ఇవి వర్షాకాలంలో వచ్చే గొంతు నొప్పి, ఫ్లూ వంటివి అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. చల్లని వాతావరణంలో మీ శరీరంను వెచ్చగా ఉంచుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : herbals benefits  home remedies  health tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more