Energy Drinks may Pose Danger to Human Heart | ఎనర్జీ డ్రింక్స్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే...

Energy drinks most dangerous

Energy Drinks, Teratology Society Journal, Junk Food, Heart Problems,

New data shows junk food, energy drinks may pose unique risks for teens. Influences on teen brain development the focus of special Teratology Society journal issue.

ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

Posted: 12/20/2017 03:59 PM IST
Energy drinks most dangerous

ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఇటీవ‌ల ఎన‌ర్జీ డ్రింక్‌లు అధికంగా తాగ‌డం వ‌ల్ల క‌పాలానికి రంధ్రం ప‌డి చనిపోయిన వ్య‌క్తి గురించి ఉద‌హ‌రించింది.

ఒక మనిషి శారీరక అవసరాలకు రోజుకు 50 గ్రాముల చక్కెర సరిపోతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతాయి. అయితే ఒక ఎనర్జీ డ్రింక్‌లోనే దాదాపు 52 గ్రాముల చక్కెర ఉంటుంది!. యుక్తవయసులోని మనిషికి రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫీన్ తీసుకోవడమే ఎక్కువ. 500 మిల్లీగ్రాముల ఎనర్జీ డ్రింక్ క్యాన్‌లో దాదాపు 160 ఎమ్‌జీ కెఫిన్ ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ పరిశోధనల ప్రకారం ఎనర్జీ డ్రింకులకు అలవాటుపడ్డ యువత తదుపరి దశలో ఆల్కహాల్‌పై ఆసక్తిచూపే అవకాశం ఉందని తేలింది. ఎనర్జీ డ్రింకులు యువతను ఆవిధంగా ప్రేరేపిస్తాయని ఆ వర్సిటీ అధ్యయనకర్తలు పేర్కొన్నారు.

ఎనర్జీ డ్రింకులను అతిగా సేవించడం వల్ల శరీరంలో ఐరన్ లోపం సంభవిస్తుంది. ఐరన్‌లోపం వల్ల మనిషి చాలా త్వరగా అలసి పోవడంతో పాటు రకరకాల దుష్పరిణామాలు ఉంటాయి. ఆ పానీయాల్లో ఉండే కెఫైన్ శ‌రీరంలో ముఖ్య‌మైన భాగాల మీద తీవ్రంగా ప్ర‌భావం చూపుతుంద‌ని తెలిపింది. దీని వ‌ల్ల గుండె ల‌య త‌ప్ప‌డం, ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌లో అవ‌రోధాలు ఏర్ప‌డ‌డం జరుగుతుందని చెప్పింది. ఇప్ప‌టికే బీపీ, హృద్రోగ స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్న వారు ఎన‌ర్జీ డ్రింకుల‌కు దూరంగా ఉండాల‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ సంస్థ కూడా సూచించింది.

ఎనర్జీ డ్రింకులను తీసుకోవడం వల్ల శరీరంపై పడే ప్రభావాలు. వీటిని బట్టి చూసుకొంటే ఎనర్జీ డ్రింకులు సేవించడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో సులభంగా అర్థం అవుతుంది. వాటికి బ‌దులుగా స‌హ‌జంగా ల‌భించే ప‌ళ్ల‌ర‌సాలు, కొబ్బ‌రి నీళ్లు వంటివి తీసుకోవాల‌ని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Smart phone lock tips

    స్మార్ట్ ఫోన్ కి సెక్యూరిటీ పెట్టాల్సిందే!

    Oct 11 | స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో కనిపించేందే. తక్కువ ధరలో అడ్వాన్స్ అప్లికేషన్లతో లోకల్ బ్రాండ్లు కూడా ఫోన్లు మార్కెట్ లోకి దించేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలోనూ దాదాపుగా 90 శాతానికి పైగా ఆండ్రాయిడ్... Read more