Rohit Sharma once felt like punching Jadeja వామ్మో.! జడేజాతో కలసి ఎక్కడికీ వెళ్లం..

India vs south africa 3rd odi visitors keen to seal off an unbeatable lead

India vs South Africa 2018, Rohit Sharma, Ajiinkya Rahane, Ravindra Jadeja, Ritika Sajdeh, Radhika Rahane, India tour of South Africa, cheetah, sports news,sports, latest sports news, cricket news, cricket

Rohit Sharma and Ajinkya Rahane recalled the safari experiences that they had during the tour of South Africa.

వామ్మో.! జడేజాతో కలసి ఎక్కడికీ వెళ్లం..

Posted: 06/05/2018 04:34 PM IST
India vs south africa 3rd odi visitors keen to seal off an unbeatable lead

సఫారీ గడ్డపై ఈ ఏడాది ప్రారంభంలో పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టు అక్కడ.. అరుదైన రికార్డును నెలకొల్పి సగర్వంగా స్వదేశానికి చేరిన విషయం తెలిసిందే. అయితే అంతకన్నా ముఖ్యమైనదేమంటే.. మన క్రికెటర్లు అందరూ సురక్షితంగా భారత గడ్డపై కాలు మోపారు. అదేంటి.? అలా అంటున్నారు అంటారా.? నిజమేనండీ.. అలాంటిదే ఓ ఘటన రోహిత్, రహేనేల ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. దీంతో వారు.. వామ్మో.. రవీంద్ర జడేజాతో కలిసి ఎక్కడికీ వెళ్లకూడదు అని కూడా నిర్ణయించుకున్నారట.

తమకు ఎదురైన అనుభవాన్ని వారు పేర్కొంటూ.. భయానక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. అసలేం జరిగిందంటే... దక్షిణాఫ్రికా పర్యటనలో మ్యాచులకు మధ్యలో కాస్త విరామం లభించడంతో రోహిత్‌ శర్మ-రితిక, రహానె-రాధిక, జడేజా కలిసి అడవికి వెళ్లారు. ఆ సమయంలో చోటు చేసుకున్న ఓ సన్నివేశాన్ని రోహిత్‌, రహానె పంచుకున్నారు. ‘అందరం కలిసి ఆ అడవిలో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో రెండు చిరుతలు అటుగా వచ్చాయి. మాకు అత్యంత సమీపంలో ఉన్నాయి ఆ రెండు. మేమంతా షాక్‌కు గురై సైలెంట్‌గా వాటిని చూస్తున్నాం.

ఇంతలో జడేజా ఏదో శబ్దం చేస్తూ వాటిని పిలవడం మొదలుపెట్టాడు. ఇంకేముంది ఆ రెండు చిరుతలు వెనక్కి తిరిగి మమ్మల్ని చూశాయి. దేవుడా అయిపోయాం అని అనుకున్నాం. జడేజాపై అందరికీ చాలా కోపం వచ్చింది. ‘ఏం చేస్తున్నావు? మనం అడవిలో ఉన్నాం. అవి మనల్ని చూస్తే.. వాటికి ఆహారం అయిపోతాం అని ఆగ్రహం వ్యక్తం చేశాం. కాసేపటికి చిరుతలు అటు- ఇటు చూసుకుంటూ మాకు దూరంగా వెళ్లిపోయాయి. దీంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నామని చెప్పారు. జడేజాతో మాత్రం ఇక ఎప్పుడూ... ఎక్కడికీ వెళ్లకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాం’ అని రోహిత్‌, రహానె తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  Rohit sharma  Ravindra Jadeja  Ajinkya Rahane  cheetah  cricket  

Other Articles