Anderson can make it hard for Kohli: McGrath విరాట్ కోహ్లీకి కష్టకాలమే: అసీస్ బౌలర్ జోస్యం

Mcgrath looking forward to kohli anderson battle

virat kohli, Jimmy Anderson, Glenn McGrath, Jasprit Bumrah, India vs England, Bhuvneshwar Kumar, chatteswar pujara, cricket, cricket news, sports news, latest sports news, sports

Virat Kohli is a far more experienced player than what he was during his nightmarish tour of England in 2014 but Aussie great Glenn McGrath cautioned that an in-form Jimmy Anderson could make things tougher

విరాట్ కోహ్లీకి ముందున్నది కష్టకాలమే: అసీస్ బౌలర్ జోస్యం

Posted: 06/05/2018 05:40 PM IST
Mcgrath looking forward to kohli anderson battle

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సిందేనట. అలా ఎందుకు అని? ఎవరు చెప్పారని.. ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి కదూ. ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మెక్ గ్రాత్ ఈ మేరకు జోస్యం చెప్పాడు. త్వరలో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనను వెళ్లనున్న క్రమంలో ఆక్కడ విరాట్ కష్టకాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మెక్ గ్రాత్ అభిప్రాయపడ్డాడు. సమకాలీన క్రికెట్ లో కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని అంటూనే ఈ వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్ లోని పరిస్థితులు టీమిండియా కెప్టెన్ కోహ్లీకి ప్రతికూలంగా ఉన్నాయని చెప్పాడు. అందుకు కారణాలను కూడా విశ్లేషించాడు. ముఖ్యంగా మంచి ఫామ్ లో వున్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అండర్సన్ ను ఎదుర్కోవడం కోహ్లీకి పెను సవాలే అని అన్నాడు. అండర్సన్ బౌలింగ్ ను ఎదుర్కోవడం కష్టమే అని తెలిపాడు. కోహ్లీపైనే భారత్ ఆధారపడితే ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఈ పర్యటనలో పుజారా రాణిస్తాడనే నమ్మకం తనకు ఉందని చెప్పాడు.

అయితే టీమిండియా బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్ లు కూడా ఇంగ్లాండ్ గడ్డపై చక్కగా రాణిస్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు. భారత జట్టు సమష్టిగా రాణిస్తేనే ఫలితం దక్కుతుందని సూచించాడు. మరోవైపు అన్ని దేశాల్లో సత్తా చాటిన కోహ్లీ... ఇంగ్లండ్ లో మాత్రం తడబడుతున్నాడు. గత ఇంగ్లండ్ పర్యటనలు కోహ్లీకి నిరాశనే మిగిల్చాయి. దీంతో, ఈసారి ఇంగ్లీష్ పిచ్ లపై తన సత్తా చాటాలనే పట్టుదలతో కోహ్లీ ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles