టీమిండియా డాషింగ్ ఓపెనర్ గా ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. రిటైర్మెంట్ తరువాత ప్రారంభించిన రెండో ఇన్నింగ్స్ లోనూ అదే దూకుడును కనబరుస్తున్నాడు. మాకు తెలుసు మీకు విషయం అర్థమైందని.. ఆయన చేపట్టిన రెండో ఇన్నింగ్స్ ట్వీటేగా అంటున్నారు కదూ. నిజమేనండి. అయితే తన ట్విట్లతో ఎప్పటికప్పుడు అన్ని విషయాలపై తనదైన స్టైల్లో షాట్లు కొడుతున్న వీరూ.. అభిమానులను అలరిస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెహ్వాగ్ ట్వీట్ తో పాటు ఒక వీడియో కూడా జత చేసి పోస్ట్ చేసాడు. ఈ ట్వీట్, వీడియో అభిమానులలో నవ్వులను పూయిస్తుంది. ఇప్పటికే నైజీరియన్ ఫుట్ బాల్ ప్లేయర్ అప్ డేట్ వర్షన్ తీసుకుంటున్నారంటూ అతని వివాహాం ఫోటోనూ పెట్టి ట్వీట్ చేసి.. ప్రతీ ఏడాది అప్ డేట్ చేసుకోవద్దని, ఇక తాము అప్ డేట్ 15ను చూడకూడదని భావిస్తున్నామని చెప్పాడు. ఇంతకీ ఈ అప్ డేట్ ఏంటంటారా..? నైజీరియన్ ఫుల్ బాల్ ప్లేయర్ ఇమాన్యుయేల్ తన భార్య మిస్ నైజీరియా 13కు విడాకులిచ్చి.. మిస్ నైజీరియా 14గా గెలుపొందిన యువతిని వివాహమాడాడు.
Unistall version 13, install version 14. Upgrading wife like phone. Emmanuel please don’t be annual. No version 15 please. pic.twitter.com/YHopoxLOlb
— Virender Sehwag (@virendersehwag) May 30, 2018
ఇక తాజాగా పోస్టు చేసిన వీడియో విషయానికొస్తే.. అనుకోకుండా అత్తగారు వస్తే ఏం చేయాలన్నది వీరూ.. వీడియో ద్వారా చూపాడు. ఈ వీడియోలో.. ఓ భర్త తన భార్య కాళ్లను చిన్న ప్లాస్టిక్ టబ్‌లో పెట్టి కుడుగుతుంటాడు, ఇలా భార్యపై తాకున్న ప్రేమను చాటుకుండాడు. అదే సమయంలో అతని తల్లి అనుకోకుండా అక్కడకు వస్తుంది. ఇది గమనించిన వారు ఆమె వీరిని చూసేలోపే.. భార్యభర్తలు పొజిషన్స్ చేంజ్ చేసుకుంటారు. భర్త తలను భార్య కడుగుతున్నట్టుగా నటిస్తారు. ఈ వీడియో చూసి మీరు కాసేపు సరదాగా నవ్వుకోండి. రిటర్మెంట్ అనంతరం సెహ్వాగ్ ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
When your mother-in law suddenly appears pic.twitter.com/tLCdF29Nhf
— Virender Sehwag (@virendersehwag) June 1, 2018
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more