MS Dhoni's Utmost Respect For The Indian Flag వారెవ్హా ధోని.. నిజమైన దేశభక్తి అంటే నీదే..

Ms dhoni doesn t wear indian flag on his helmet why

ms dhoni, former indian captain, dhoni helmet flag, indian national flag, flag cricket helmet, dhoni cricket helmet, dhoni wicket-keeping helmet, dhoni respect flag, dhoni indian army, dhoni overshadows kohli, virat kohli, indian cricket captain, cricket, cricket news, sports news, latest sports news, sports

But probing the MS Dhoni's affection towards the nation, While Virat Kohli proudly wears the flag on his helmet, it isn't the same case with Dhoni.

వారెవ్హా ధోని.. నిజమైన దేశభక్తి అంటే నీదే..

Posted: 03/09/2018 05:17 PM IST
Ms dhoni doesn t wear indian flag on his helmet why

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనలోని దేశభక్తిని చాటుకోవడంలో భాగంగానే తన హెల్మెట్ పై భారత జాతీయ జెండా చిహ్నాన్ని ఏర్పాటు చేసుకోలేదంటే వినడానికే వింతగా వున్న అందులోని పరమార్థం తెలిస్తే మాత్రం ఔరా అని ఆశ్చార్యాన్ని వ్యక్తం చేయకమానరు. దేశం తరపున అడుతున్న క్రికెటర్లు తమ హెల్మెట్ లపై తమ దేశ జాతీయ జెండా చిహ్నాన్ని ముద్రించుకోవడం అలవాటుగా, పరిపాటిగా వస్తుంది. జట్టు క్లిష్ట సమయాల్లో వున్నప్పుడు తమ హెల్మెట్ ను చూసి జాతీయ జెండా చిహ్నాన్ని చూసి ఎంతో స్పూర్ఫి పోందుతారు.

జట్టు తరపున తాము వ్యక్తిగతంగా అర్థశతకమో లేక శతకాన్నో నమోదు చేసిన ప్రతీసారి హెల్మెట్ ను తీసి.. అందులోని జాతీయ జెండా చిహ్నాన్ని ముద్దాడుతారు కూడా. ఇలా ఈ చిహ్నాన్ని చూసి తాను చాలా స్పూర్ఫి పోందానని స్వయంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కరే ఓకానోక సందర్భంలో చెప్పాడు. అయితే ధోని మాత్రం తన హెల్మెట్ పైన జాతీయ జెండా చిహ్నాన్ని ఏర్పాటు చేసుకోలేదు. 14 ఏళ్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ హెల్మెట్ పై మాత్రం జాతీయ జెండా చిహ్నం కనిపించదు. అయినా అతని దేశభక్తిని భేష్ అని కీర్తిన్తున్నారు...

ఎందుకలగా.. అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు కదూ..? కానీ వివరణలోకి వెళ్లే.. దీనికి ఒక మంచి కారణం ఉంది. ధోనీ కీపర్ గా కూడా బాధ్యతలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కీపింగ్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో హెల్మెట్ ను కింద పెట్టాల్సి వస్తుంది. రాజ్యాంగం ప్రకారం జాతీయ జెండాను కింద పెట్టడం పెద్ద తప్పు. నేరం కూడా. ఈ నేపథ్యంలో, హెల్మెట్ ను కింద పెట్టాలంటే, దానిపై జాతీయ జెండా చిహ్నం ఉండకూడదు. ఈ కారణం వల్లే ధోనీ తన హెల్మెట్ పై జెండాను ఉంచుకోడు. మరీ దేశభక్తి వుండబట్టే కదా ధోని ఇలా చేస్తున్నాడు. శభాష్ ధోని.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  dhoni helmet flag  indian national flag  wicket-keeping  indian army  cricket  

Other Articles