Shami charged with domestic violence, attempt murder షమీపై గృహహింస, హత్యాయత్నం కేసులు..

Mohammed shami charged with domestic violence attempt murder

Mohammed Shami, Kolkata Police, Hasin Jahan, Indian cricket team, cricket, Deodhar Trophy, domestic violence, rape, cricketer, wife, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Kolkata Police have charged India pacer Mohammed Shami and his brother with IPC sections related to rape, domestic violence and causing hurt with poison following a complaint by Hasin Jahan, the cricketer’s wife.

షమీపై గృహహింస, హత్యాయత్నం కేసులు..

Posted: 03/09/2018 04:03 PM IST
Mohammed shami charged with domestic violence attempt murder

టీమిండియా బౌలర్ మహమ్మద్ షమిపై ఎట్టకేలకు పోలీసులు పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన భార్య హసీన్ జహాన్ అతనిపై సంధించిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో గత కొంతకాలంగా ఢిపెన్స్ లో పడిన షమీ.. మీడియాకు కూడా అందకుండా పోతున్న విషయం తెలిసిందే. తన భర్త షమీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారని, తన భర్తకు ఇతర మహిళలతో వివాహేతర సంబంధం ఉందని అరోపణలు చేసిన ఆమె ఎట్టకేలకు ఈ విషయమై పోలీసులకు కూడా పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు షమీ సహా అతని కుటుంబసభ్యులపై పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అంతకుముందే మీడియా ద్వారా తన అవేదనను వెళ్లగక్కిన జహాన్.. షమిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని కూడా తేల్చిచెప్పింది. ఇక జహాన్ పిర్యాదును అందుకున్న పోలీసులు ఇవాళ షమితో పాటు మరో నలుగురిపై ఐపీసీ 498 ఏ, 323తో పాటు పలు సెక్షన్ల కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులకు ఆమె పలు ఆధారాలను కూడా సమర్పించినట్లు సమాచారం. తనను చంపేందుకు కూడా తమ మెట్టినింటివారు ప్లాన్లు వేశారని, షమి తనను కొట్టేవాడని ఆమె పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. కాగా పాకిస్థాన్ మహిళ నుంచి కూడా షమీ డబ్బులు అందుకున్నాడని.. షమీ దేశద్రోహానికి కూడా పాల్పడివుండవచ్చని అనుమానాలను సైతం వ్యక్తం చేసింది.

అయితే తన భార్య హసీన్ జహాన్ అరోపణల నేపథ్యంలో పేసర్ షమీ స్పందించాడు. పాకిస్థాన్ మహిళ నుంచి డబ్బులు స్వీకరించానన్న తన భార్య ఆరోపణలను ఖండించాడు. తాను ఎలాంటి ఫిక్సింగ్ కు పాల్పడలేదని, ఎవరి నుంచీ డబ్బులు తీసుకోలేదని అన్నాడు. ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న తన భార్య మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేశాడు. తనపై ఆమె చేసిన ఫిక్సింగ్‌ ఆరోపణలు దారుణమని, వాటిని ఆమె నిరూపించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. దీనిపై సరైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాడు. తాను తన భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కుదరడం లేదని, ఆమె చుట్టూ ఉన్నవాళ్లు చేసిన కుట్ర ఇదని, ఇంత తీవ్రమైన అభియోగాలు ఇప్పుడే ఎందుకు మోపుతోందో తనకు అర్థం కావడం లేదని షమీ పేర్కొన్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles