Wasim Akram urges A+ grade for Test cricketers టెస్టు క్రికెటర్లకు బిసిసిఐ ఇచ్చే గౌరవం ఇదేనా..?

Wasim akram questions grade a for limited over players

Wasim Akram, BCCI, Rohit Sharma, Shikhar Dhawan, Cheteshwar Pujara, R Ashwin, Ravindra Jadeja, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Pakistan cricket team legend Wasim Akram has raised questions over BCCI decision to promote limited over specialits crickters to Grade A+ category while keeping test specialists in the Grade A section.

టెస్టు క్రికెటర్లకు బిసిసిఐ ఇచ్చే గౌరవం ఇదేనా..?

Posted: 03/12/2018 06:05 PM IST
Wasim akram questions grade a for limited over players

క్రికెటర్ల అటతీరుకు, నైపుణ్యానికి కొలమానంగా నిలిచే టెస్టు క్రికెట్ ను కాదని కేవలం పరిమిత ఓవర్లను ప్రోత్సహిస్తూ భారత్ క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ ప్రశ్నించాడు. పరిమిత ఓవర్లలో తమ బ్యాటు నుంచి పరుగుల వరదను సృష్టించే శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను బిసిసిఐ ఏ ప్లస్ గ్రేడ్ క్యాటగిరీలో జాబితాలో చేర్చడం పట్ల ఆయన నిలదీశారు. బీసీసీఐ నిర్ణయం సరైనది కాదని పేర్కొన్నాడు. టీమిండియా క్రికెటర్ల వార్షిక వేతన కాంట్రాక్ట్‌ ను పునరుద్ధరిస్తూ బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయంపై ఆయన పెదవి విరిచాడు. లో ఐదుగురు ఆటగాళ్లకు స్ధానం కల్పించిన బీసీసీఐ పాలకమండలి, వారికి ఏడాదికి ఏడు కోట్ల వేతనం ఇస్తామని ప్రకటించింది.

 ఏ ప్లస్ గ్రేడ్ లో టెస్ట్‌ స్పెషలిస్ట్‌ బ్యాట్స్ మన్ ఛటేశ్వర్‌ పుజారా, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్‌, అల్ రౌండర్ రవీంద్ర జడేజాలకు స్థానం కల్పించకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశాడు. టెస్టు క్రికెట్ లో నైపుణ్యం ప్రదర్శించే వారిని కాదని, పరిమిత ఓవర్ల క్రికెట్ కు పరిమితమైన రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ కు చోటు కల్పించడం సరికాదని అన్నాడు. టెస్ట్‌ క్రికెట్‌ చాలా కఠినమైనదని, అక్కడ నిరూపించుకున్న ఆటగాడు ఎక్కడైనా నిరూపించుకోగలడని, వారికే ఎక్కువ పారితోషికం అందించాలని అక్రమ్ స్పష్టం చేశాడు. అక్రమ్ అభిప్రాయంపై క్రికెట్ లో చర్చ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wasim Akram  BCCI  Rohit Sharma  Shikhar Dhawan  Cheteshwar Pujara  R Ashwin  Ravindra Jadeja  cricket  

Other Articles