Raina records 50 sixes hit in T20 రీఎంట్రీతో రికార్డు సృష్టించిన సురేశ్ రైనా..

Suresh raina becomes third indian batsman to hit 50 sixes in t20i

Bangladesh, suresh raina, Bangladesh vs India,Cricket,India,India vs Bangladesh,Jaydev Unadkat,Mahmudullah,Manish Pandey,Nidahas Trophy,Nidahas Trophy 2018,Rohit Sharma,Shikhar Dhawan,T20I,Vijay Shankar, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Suresh Raina became the third cricketer to join the club of Indian batsmen who have hit 50 sixes in T20I cricket. Raina reached the landmark during the second T20I with Bangladesh in the Nidahas trophy tri-series.

రీఎంట్రీతో రికార్డు సృష్టించిన సురేశ్ రైనా..

Posted: 03/09/2018 03:05 PM IST
Suresh raina becomes third indian batsman to hit 50 sixes in t20i

టీమిండియా జట్టులోకి రిఎంట్రీ కోసం గత కొంతకాలంగా ఎంతో ఆశగా ఎదురుచూసిన డాషింగ్ బాట్స్ మెన్ సురేశ్ రైనా రీఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే తన పేరున రికార్డును నెలకొల్పాడు. నిదహాస్ ట్రోఫీలో భాగంగా కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచులో టీమిండియా ఘనవిజాయాన్ని నమోదు చేసుకున్న నేపథ్యంలో సురేష్ రైనా తన పేరున ఈ ఘనతను రాసుకున్నాడు. ఇంతకీ అ ఘనత ఏమిటీ అని అడుగుతున్నారు కదూ.. అక్కడికే వస్తున్నాం.

జట్టులోకి రీఎంట్రీ ఇచ్చింది తాను మాత్రమే కానీ తన ఆట కాదని, తన బ్యాటుతో సిక్సర్లను ఘుళిపించిన సురేశ్ రైనా నిన్నటి మ్యాచులో సరికొత్త రికార్డు సృష్టించాడు. 27 బంతుల్లో ఫోర్, సిక్సర్లతో 28 పరుగులు చేసిన రైనా టీ20ల్లో 50 సిక్సర్లు కొట్టిన మూడో భారత బ్యాట్స్‌మన్ గా తన పేరును మరో ఘనతను నమోదు చేసుకున్నాడు. రైనా కంటే ముందు యువరాజ్ సింగ్ 74 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 69 సిక్సర్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. కాగా, రైనా తరువాత ధోని, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వరుసగా 46, 41 సిక్సర్లతో ఆ తరువాతి వరుసక్రమంలో కొనసాగుతున్నారు.

అయితే అంతర్జాతీయంగా చూస్తే విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్, న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్‌లు 103 సిక్సర్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. నిన్నటి మ్యాచ్‌లో బంగ్లదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ ట్రోఫీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత రైనా తొలిసారిగా దక్షిణాఫ్ఱికాతో జరిగిన టీ20 మ్యాచ్ లో పాల్గోన్నాడు. అంతకుముందు గతేడాది ఫిబ్రవరి మాసంలో ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్ లో మెరిసాడు రైనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles