భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి అరుదైన అవకాశం దక్కింది. అండర్-19 ప్రపంచకప్ పోటీలలో ఆయన కామెంటేటర్ గా ఎంపికయ్యారు. ఈ నెల 13 నుంచి న్యూజిలాండ్ వేదికగా అండర్-19 ప్రపంచకప్ టార్నోమెంటు జరగనుంది. ఈ టోర్నీకి కామెంటేటర్ బాధ్యతలు నిర్వహించే వారి జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. 14మందితో కూడిన జాబితాలో భారత్ కు చెందిన మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, అంజుమ్ చోప్రా చోటు దక్కించుకున్నారు.
ఇప్పటికే కామెంటేర్లుగా బాద్యతులు నిర్వహిస్తున్న గంగూలీ, అంజుమ్ చోప్రాలతో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక తదితర దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న టోర్నీ ఫిబ్రవరి 3తో ముగియనుంది. పృథ్వీ షా నాయకత్వంలోని భారత జట్టు ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది. రెండు రోజుల క్రితం దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కాగా ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ టార్నమెంటులో కామెంటేటర్ గా ఎంపికైన సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. తాను ఈ ఈవెంట్ లో పాల్గోంటున్నందుకు చాలా సంతోషంగా వుందని అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా రాబోతున్న భవిష్యత్ టాలెంట్ ను దగ్గర్నుంచి చేసేందుకు తనకు ఈ ఎంపిక దోహదపడుతుందన్నాడు. ఈ ఈవెంట్ లో అన్ని దేశాలకు చెందిన అప్ కమింగ్ టాలెంట్ ను వీక్షించే ఏకైక వేదికగా కొనియాడారు.
కామెంటరీ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్న వారు:
* సౌరభ్ గంగూలీ(ఇండియా)
* అంజుమ్ చోప్రా(ఇండియా)
* టామ్ మూడీ (ఆస్ట్రేలియా)
* ఇయాన్ బిషప్(వెస్టిండీస్)
* సైమన్ డౌల్(న్యూజిలాండ్)
* డానీ మారిసన్(న్యూజిలాండ్)
*హెచ్‌డీ అకర్మన్(దక్షిణాఫ్రికా)
*రాబ్ కీ(ఇంగ్లాండ్)
* నిక్ నైట్(ఇంగ్లాండ్)
* మార్క్ బుచర్(ఇంగ్లాండ్)
* గ్రాంట్ ఇలియాట్(న్యూజిలాండ్)
* క్రిస్ హారిస్(న్యూజిలాండ్)
* రసూల్ ఆర్నాల్డ్(శ్రీలంక)
* అలాన్ విలకిన్స్(ఇంగ్లాండ్)
(And get your daily news straight to your inbox)
Apr 16 | రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులో తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలోని పిచ్ స్వభావాన్ని తాము సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ మ్యాచులో... Read more
Apr 13 | క్రికెట్ లో బ్యాట్స్ మెన్లకు లేక ఫీల్డర్లకు బంతులు తగలడం అన్నది సర్వసాధారణం. అయితే కొద్దికాలం క్రితం వరకు తాము సేప్ అనుకున్న అంఫైర్లకు కూడా ఇప్పుడు గాయాలు తగులుతున్నాయి. దీంతో అంఫ్లైర్లు కొన్ని... Read more
Apr 13 | హైదారబాద్ వేదికగా సాగిన రెండో మ్యాచులో రమారమి విజయపుటంచుల వరకు చేరని ముంబై ఇండియన్స్ జట్టు చిట్టచివరి బంతి ముందు బోర్లాపడటం తనను తీవ్రంగా కలచివేస్తోందని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ... Read more
Apr 11 | చెన్నై వేదికగా జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లను జరగబోనివ్వమని నామ్ తమిజార్ కట్చి నేతలు, నిర్వహకులను హెచ్చరించిన నేపథ్యంలో.. దీనిపై దృష్టి సారించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. చెన్నై వేదకను రద్దు... Read more
Apr 09 | కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో తమ ఓటమికి కారణం ఏంటో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పేశాడు. 176 పరుగుల భారీ స్కోరు చేసినా సరిపోలేదని, మరో... Read more