Rahane dilemma ahead of must-win Test సెంచూరియన్ లోనూ అజంక్య రహానే మొండిచెయ్యి

Ajinkya rahane dilemma ahead of must win test vs south africa

India vs South Africa 2018, India vs South Africa, BCCI, Ajinkya Rahane, ICC World T20, Dublin, Belfast, Virat Kohli, Vernon Philander, South Africa cricket team, Jasprit Bumrah, India Cricket team, Bhuvneshwar Kumar, AB de Villiers, Centurion Test, sports news, sports, cricket news, cricket

Virat Kohli’s Indian cricket team, 0-1 down in the three-Test series against South Africa, are grappling with selection and speculation is high on whether Ajinkya Rahane will be recalled.

సెంచూరియన్ లోనూ అజంక్య రహానే మొండిచెయ్యి

Posted: 01/13/2018 10:59 AM IST
Ajinkya rahane dilemma ahead of must win test vs south africa

కేప్ టౌన్ టెస్టులో విరాట్ సేన విఫలమై 72 పరుగులతో ఓటమిని చవిచూసిన తరువాత సెంచూరియన్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో మార్పులకు శ్రీకారం చుటుతుందని భావించినా ఈ టెస్టులోనే టెస్టు క్రికెట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు మొండి చెయ్యి ఇచ్చేందుకు జట్టు యాజమాన్యం సిద్దమైనట్లు సమాచారం. తొలి టెస్టులో చేజేతులా ఓటమిని చవిచూసి విజయావకాశాలను జారవిడిచిన కోహ్లీసేన.. సెంచూరియన్ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి కొని తెచ్చుకుంది.

సెంచూరియన్‌ పిచ్‌ అదనపు బౌన్స్‌, స్వింగ్ కు అనుకూలిస్తుందని విశ్లేషణతో కోహ్లీసేన నెట్స్‌లో కఠిన సాధన చేసింది. ఛెతేశ్వర్‌ పుజారా ఫస్ట్ స్లిప్ లో క్యాచ్లు సాధన చేయగా.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ నెట్స్ లో ముమ్మరంగా బ్యాటింగ్ చేశారు. కీలక అంశం ఏమిటంటే ఈ సెషన్ లో అజింక్య రహానె ఒక మూగ ప్రేక్షకుడిగా మాదిరిగా వారిద్దరి ఆటను వీక్షించాడు.

బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అతడికి కొన్ని బంతులు విసిరాడు. శిఖర్‌ ధావన్‌కు కూడా అంతే. ఐతే వీరిద్దరూ అసలైన పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేదు. దీనిని బట్టి రెండో మ్యాచ్‌లో వీరిద్దరూ ఆడే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. పేస్‌, స్వింగ్‌ బౌలింగ్‌లో బ్యాట్‌తో అటు అడ్డంగా.. ఇటు నిలువుగా షాట్లు ఆడే అజింక్యను కెప్టెన్ విరాట్ ఎందుకు పక్కనబెడుతున్నారన్న విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs south africa  Virat Kohli  BCCI  Ajinkya Rahane  shikar dhawan  rohit sharma  cricket  

Other Articles