Heavy rain continues, third T20 under threat ఉప్పల్ పరిస్థితే 3వ టీ20లోనూ ఉత్పన్నమయ్యేనా..?

Ind vs nzl heavy rain continues third t20 under threat

Cricket, T20, India v/s New Zealand, Ind vs NZL, Ind vs NZl 3rd T20, Thiruvananthapuram, Thiruvananthapuram Rainfall, Indian cricket team, New Zealand, Virat Kohli, Tom Latham, Ross Taylor, Kane Williamson, Kedar Jadhav, Kuldeep Yadav, Yuzvendra Chahal, Trent Boult, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

Heavy rain continued to pound Thiruvananthpuram, the venue for the third and deciding Twenty20 International between India and New Zealand, forcing both teams to cancel their practice sessions.

ఉప్పల్ పరిస్థితే 3వ టీ20లోనూ ఉత్పన్నమయ్యేనా..?

Posted: 11/06/2017 05:01 PM IST
Ind vs nzl heavy rain continues third t20 under threat

పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో జరుగుతున్న టీ 20 సిరీస్ డ్రాగా ముగిసే అవకాశం వుంది. అచ్చంగా ఉప్పల్ స్టేడియంలో అసీస్ తో జరగాల్సిన మ్యాచ్ ఎలా అయితే రద్దు కాబడిందో అదే తరహా పరిస్థితులు ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రమాదం పోంచి వుంది. అందుకు కారణం.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో ఇప్పటికే చెరోకటి గెలిటి సమంగా వున్న తరుణంలో అత్యంత కీలకం, నిర్ణయాత్మకమైన మూడో టీ20లో గెలుపు కోసం ఇరు జట్టు శ్రమిస్తున్న క్రమంలో ఈ పిడుగులాంటి వార్త భారత్ క్రికెట్ అభిమానులను అసహనానికి గురిచేస్తుంది.

మంగళవారం (నవంబర్ 7) సాయంత్రం కేరళలోని తిరువనంతపురంలో ఈ బిగ్ ఫైట్ జరగనుంది. అయితే వారం రోజులుగా పడుతున్న వర్షాలతో స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. మూడు రోజులుగా అయితే ఎడతెరిపిలేకుండా వాన పడుతుంది. గ్రౌండ్ అంతా చిత్తడిగా మారింది. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉంది. మ్యాచ్ జరిగే గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అయితే మూడు రోజులుగా ఎండలేకపోవటంతో గ్రౌండ్ ఆరటం లేదు. ఎప్పటికప్పుడు నీళ్లు బయటకు వెళుతున్నా.. ఔట్ ఫీల్డ్ పై బాగా తేమ ఉంది.

మరో 24 గంటలు అకాల వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికతో మ్యాచ్ జరగటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వర్షం పడినా ఇబ్బంది లేదని కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. మా దగ్గర ప్లాన్ A, B, C ఉన్నాయని.. వర్షం వస్తే ఏం చేయాలో తెలుసు అంటున్నారు అసోసియేషన్ సెక్రటరీ జయేష్ జార్జ్. ఎవరు ఎన్ని చెప్పినా.. వర్షాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదుకాబట్టి.. మ్యాచ్ నిర్వహణ కష్టం అంటూ ఓ జాతీయ ధినపత్రిక తన వైబ్ సైట్ పోర్టల్ లో కథనాన్ని ప్రచురించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles