Tainted players still playing in the IPL బిసిసిఐ, క్రికెటర్లపై శ్రీశాంత్ సంచలన అరోపణలు..

Sreesanth makes shocking revelations in match mixing case

Cricket, ODI, IPL 2017, Indian Cricket, S Sreesanth, TeamIndia, Sreesanth, kerala speedstar, ICC, ICC Events, fixing cricketers, spot fixing case, BCCI, sports news,sports, latest sports news, cricket news, cricket

Sreesanth had gone on record saying that there are other players in the league who were also accused but no action was taken against them.

బిసిసిఐ, క్రికెటర్లపై శ్రీశాంత్ సంచలన అరోపణలు..

Posted: 11/02/2017 07:39 PM IST
Sreesanth makes shocking revelations in match mixing case

టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిసిసిఐ నన్ను మాత్రమే కావాలని ఏరి కోరి బలిపశువును చేసింది. ఐపీఎల్ లో ఇప్పటికీ అక్రమాలకు పాల్పడిన క్రికెటర్లు అడుతున్నారని ఆయన సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఇటీవల శ్రీశాంత్ ను నిర్దోషిగా పేర్కోంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన బిసిసిఐ.. అక్కడ ఈ స్పీడ్ స్టర్ పై గెలించింది. హైకోర్టు ఏకంగా శ్రీశాంత్ పై జీవితకాలం నిషేధాన్ని విధించడంతో పాటు మరో ఉన్నత కోర్టుకు వెళ్లేందుకు కూడా అనుమతిని నిరాకరించింది.

దీంతో తనపై కేవలం కేవలం బీసీసీఐ నిషేధం విదించింది.. కానీ ఐసీసీ కాదని.. దీంతో తాను వేరే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవల చెప్పిన శ్రీశాంత్.. ఈ నేపథ్యంలో ఫిక్సింగ్ కు సంబంధించిన పలు అంశాలను వెల్లడించినట్లు సమాచారం. టీమిండియాలో ఇప్పటికీ, ఐపీఎల్ లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్ తో సంబంధం ఉంది. కానీ బీసీసీఐ తన ఒక్కడిపైనే కక్ష సాధించిందని అన్నట్లు చర్చ సాగుతోంది..

అయితే ఫిక్సింగ్ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడితే ఫిక్సింగ్ కు పాల్పడిన అందరి పేర్లు బయటకొస్తాయని' శ్రీశాంత్ వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముద్గల్ రిపోర్టులో ఆ క్రికెటర్ల పేర్లు ఉన్నట్లు కూడా సమాచారం. అయితే ముద్గల్ కమిటీలో సభ్యుడైన న్యాయవాది కూడా ఈ వాదనలను తెరపైకి తీసుకురావడం పాతగాయాన్ని రేపుతూ ప్రకంపనలు సృష్టిస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TeamIndia  Sreesanth  kerala speedstar  ICC  ICC Events  fixing cricketers  spot fixing case  BCCI  cricket  

Other Articles