Ramiz Raja Trolled by Indian Fans for Questioning Dhoni's Grade ఇంట్లో ఈగల మోత.. అయినా పల్లకీ సేవా..?

Ramiz raja trolled by indian fans for questioning dhoni s grade

Team India, BCCI, Mahendra Singh Dhoni, Rameez Raja, Indian cricket fans, Pakistan, PCB, cricket, virat kohli, sourav ganguly, sachin tendulkar, vvs laxman, rajeev shukla, cricket news, sports news, latest news

Former Pakistan batsman Ramiz Raja has urged the International Cricket Council (ICC) to set aside a two-month window solely for Test matches in a bid to preserve the longest form of the game.

ఇంట్లో ఈగల మోత.. అయినా పల్లకీ సేవా..?

Posted: 07/06/2017 02:15 PM IST
Ramiz raja trolled by indian fans for questioning dhoni s grade

ఇంట్లో ఈగల మోత మొగుతున్నా.. బయట మాత్రం పల్లకీ సేవ కావలనే నానుడి తెలియని తెలుగువారుండరు. అచ్చం అలాగే వుంది పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా పరిస్థితి. తమ దేశానికి సంబంధించిన అంశంలో మరీ ముఖ్యంగా క్రికెట్ లో అంతర్గత వ్యవహారాల్లో టీమిండియాకు చెందిన ఏ క్రికెటర్ (మాజీలతో సహా) కూడా వేలు పెట్టకపోయినా.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు మాత్రం బయట పల్లకీల సేవ కోసం వెంపర్లాడతారన్నది మరోమారు ఈయన విషయంలో స్పష్టమైంది. తమ దేశీయ క్రికెట్ లోనే తగిన విలువను రాబట్టుకోలేకపోతున్న రమీజ్ రాజా.. ఏకంగా బిసిసిఐ వ్యవహారాల్లో తలదూర్చారు.

అదీనూ టీమిండియాపై సుప్రీంకోర్టు వేసిన కమిటీలోని సభ్యుడు, చరిత్రకారుడు అయిన రామచంద్ర గుహ.. రాహుల్ ద్రావిడ్ సహా ధోని ఇతర క్రికెటర్లపై తన రాజీనామా లేఖలో పలు ప్రశ్నలు బిసిసిఐకి సంధించిన తరువాత.. అదే విషయాన్ని పట్టుకుని రమీజ్ రాజా వేలాడుతున్నాడు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి గ్రేడ్ ఏ కాంట్రాక్టు ఇవ్వడం ఏంటని ప్రశ్నించాడు. అయితే పదేళ్ల పాటు దేశ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి.. అనేక విజయాలను అందించిన క్రీడాకారులకు తమ దేశంలో సముచిత స్థానం ఇవ్వరేమో కానీ.. మన దేశంలో మాత్రం ఇస్తారన్న విషయాన్ని ఆయన ముందుగా తెలుసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

ఇక సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అనేక మంది భారత క్రీడాభిమానులు రమీజ్ రాజా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘పాకిస్థాన్ క్రికెట్ గురించి పట్టించుకోండి. పాక్ క్రికెట్ టీమ్ ఎందుకు వెనుకబడిందో ఇప్పుడు నాకు తెలిసింది. సీనియర్లు ఇతర దేశాల క్రికెటర్ల గురించి ఆలోచిస్తున్నారు కాబట్టే" అని ఓ అభిమాని కామెంట్ చేయగా, "ముందు పీసీబీ గురించి ఆలోచించండి. ఆ తరువాత బీసీసీఐని ప్రశ్నిద్దురు గాని. అసలు నువ్వు కామెంటేటరువేనా?" అని మరోకరు, "ధోనీకి ఏ గ్రేడ్ కాంట్రాక్టు ఇస్తే, నీకెందుకు బాధ... మీలాంటి వారి వైఖరి వల్లే పాక్ క్రికెట్ ఇలా ఏడుస్తోంది" అని ఇంకోకరు వ్యాఖ్యానించారు.

ధోని పేరు చెబితే తప్ప తమకు పబ్లిసిటీ రాదన్న విషయం తెలుసుకుని కొందరు అయనను ప్రోత్సహిస్తూ పబ్లిసీటీ పోందుతుంటే.. మరికోందరు మాత్రం ఇలా అయనను టార్గెట్ చేసి ఛీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నారని ఇంకొందరు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. వారిలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా కూడా చేరిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోసారి ఇండియా వస్తే, అభిమానుల నుంచి నిరసనలు ఎదుర్కోక తప్పదని, 2060 వరకూ పాక్ క్రికెట్ జట్టు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవాలు జరుపుకుంటూనే ఉండి పోతుందని, అసలు బీసీసీఐ గురించి ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడిదని... ఇలా పలు రకాల కామెంట్లు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  BCCI  Mahendra Singh Dhoni  Rameez Raja  Indian cricket fans  Pakistan  PCB  cricket  

Other Articles