India Inch Closer To Women's World CupSemi-Final సెమీస్ కు అడుగుదూరంలో టీమిండియా

India inch closer to semi final with 16 run win over sri lanka

ICC Women's World Cup 2017, India vs Sri lanka, India Women's Cricket Team, points table, women's world cup points table, cricket news, cricket, sports news, latest news

India took a giant stride towards clinching a semi-final spot with another convincing 16-run victory over Sri Lanka in a one-sided ICC Women's World Cup encounter

సెమీస్ కు అడుగుదూరంలో టీమిండియా

Posted: 07/06/2017 01:15 PM IST
India inch closer to semi final with 16 run win over sri lanka

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా మహిళల జట్టు అప్రతిహాత విజయాలతో దసుకెళ్తుంది. తొలి మ్యాచ్ లో అతిథ్య జట్టు ఇంగ్లాండ్ ను ఓడించి దూకుడును కనబర్చిన టీమిండియా మహిళల జట్టు.. ఆ తరువాత పాకిస్థాన్. వెస్టిండీస్ జట్టను ఓడించి హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. ఇక తాజాగా శ్రీలంక జట్టును కూడా కట్టడి చేసి 16 పరుగులతో విజయాలను అందుకుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయాలు సాధించిన భారత జట్టు 8 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

డెర్బీలో జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్దేశించిన 50 ఓవర్లలో 232 పరుగులను సాధించి.. 233 పరుగుల విజయ లక్ష్యాన్ని శ్రీలంక ఎదుట నిలిపింది. కాగా టీమిండియా జట్టు బౌలర్ల ధాటికి శ్రీలంక మహిళల జట్టు విజయలక్ష్యాన్ని చేధించడంలో చేతులెత్తేసింది. శ్రీలంక వికెట్ కీపర్ దిలాని మండోదర సురంగిక(61) చేసిన ఒంటరి పోరాటం వృథా అయింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసి విజయానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది. భారత బౌలర్లలో ఝులన్ గోస్వామి, పూనమ్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా దీప్తి శర్మ, ఎక్తా బిస్త్ చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్లు స్మృతి మందన, రౌత్ లు తమ వికెట్లను త్వరగానే వదులుకున్నారు. దీంతో క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ (78), కెప్టెన్ మిథాలీ రాజ్ (53) అర్ధ శతకాలతో రాణించి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. దీంతో మిధాలీ సేన గౌరవప్రదమైన స్కోరుకు నిలపగలిగింది. శ్రీలంక బౌలర్లలో శ్రీపాలి వీరక్కొడి 3 వికెట్లు పడగొట్టగా ఇనోక రణవీరా 2, శశికళ సిరివర్ధనే, అమ కంచన చెరో వికెట్ తీశారు. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన దీప్తిశర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles