BCCI reportedly lines up home series డామిడ్ కథ అక్కడే అడ్డం తిరిగింది..!

Bcci reportedly lines up home series against sri lanka and new zealand

BCCI, Cricket New Zealand, Cricket South Africa, Cricket Sri Lanka, Cricket Australia, India, cricket news, sports news, spots, cricket

The Board of Control for Cricket in India (BCCI) has reportedly lined up home series against Sri Lanka in November and New Zealand in December.

డామిడ్ కథ అక్కడే అడ్డం తిరిగింది..!

Posted: 07/06/2017 07:34 PM IST
Bcci reportedly lines up home series against sri lanka and new zealand

డామిడ్ కథ అక్కడే అడ్డం తిరిగింది.. ఇప్పుడీ మాట అంటున్నది ఎవరో కాదు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి. ఎందుకంటే బిసిసిఐ నిర్దేషిత షెడ్యూలుకు బ్రేకుల వేసి మళ్లీ మొదటి నుంచి పనులు మళ్ళీ క్రమ పద్దతిలో చేసుకురావల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి. అంటే అర్థం కాలేదు కదూ. అసలు కథ ఎక్కడ అడ్డం తిరిగింది..? అంటే అస్ట్రేలియాలో. అస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు.. అసీస్ అటగాళ్లకు మధ్య జీతబెత్యాల సమస్య మళ్ళీ ప్రకంపనలు రాజేసింది.

గతంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో అక్కడి అటగాళ్లకు ఇదే విషయమై పెద్ద యుద్దమే జరుగగా, ఇప్పుడు అవే తరహా ప్రకంపనలు అసీస్ ఆటగాళ్లకు క్రికెట్ బోర్డుకు మధ్య రాజకున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా పర్యటనను ఆస్ట్రేలియా-ఎ బహిష్కరించింది. దీంతో బీసీసీఐ ఆలోచనలో పడింది. కంగారులతో సిరీస్‌ రద్దైతే ఆటగాళ్లు సుమారు 5 నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉండాల్సి వస్తోంది. తిరిగి 2018 జనవరిలో దక్షిణాఫ్రికాతో ఆడనున్నారు. దీంతో వేగంగా పావులు కదుపుతుంది.

వెస్టీండీస్ తో ఐదు వన్డేలు, ఒక టీ20 సిరీస్‌ అనంతరం భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత్‌ వన్డే, టెస్టు, టీ20 సిరీస్‌లను ఆడనుంది. సెప్టెంబరులో శ్రీలంక పర్యటన ముగించుకుని కోహ్లీ సేన భారత్‌ రానుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. అయితే ఈ సీరిస్ ప్రశ్నార్థకంగా మారడంతో నవంబరు, డిసెంబరులో శ్రీలంక, న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించాలని బిసిసిఐ చూస్తోంది. ఈ మేరకు శ్రీలంక బోర్డు నుంచి సానుకూల స్పందనరాగా, కివీస్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందన రానట్లుగా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BCCI  Cricket New Zealand  Cricket South Africa  Cricket Sri Lanka  Cricket Australia  India  cricket  

Other Articles