SRK can sell his Pajama to buy MS Dhoni మహేంద్రుడి కోసం తన దుస్తులైనా అమ్ముతాడట

Srk is even willing to sell his pyjama to get ms dhoni

cricket, ipl 10, ipl 2017, Indian Premier League (IPL), shah rukh khan, mahendra singh dhoni, chennai super kings, Kolkata Knight Riders (KKR), Rising Pune Supergiant (RPS)

Badshah of Bollywood Shah Rukh Khan is willing to even sell his clothes to get Dhoni to play for his team KKR when the legend comes up in next year's auction.

మహేంద్రుడి కోసం తన దుస్తులైనా అమ్ముతాడట

Posted: 04/25/2017 09:30 PM IST
Srk is even willing to sell his pyjama to get ms dhoni

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వచ్చే సీజన్ కు ఇప్పటి నుంచే పావులను కదుపుతున్నారు నిర్వాహకులు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వచ్చే సీజన్ గత ఏడాది సస్పెన్షన్ కు గురైన రెండు జట్టు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు మళ్లి బరిలోకి చేరనున్నాయి. దీంతో పాటు మరో రెండు కొత్త జట్లు కూడా బరిలోకి దిగే అవకాశాలు వున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ నాటికి వేలంలో అటగాళ్లకు భలే డిమాండ్ వుంటుందనడంలో సందేహమే లేదు. మరీ ముఖ్యంగా వేలంలో నిలిచే స్టార్ అటగాళ్లకు మాత్రం బిడ్డర్లు కోట్ల రూపాయల ధర పలకాల్సి వస్తుంది.

అదే విషయాన్ని చెప్పిన బాలీవుడ్ బాద్ షా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుఖ్ ఖాన్.. వచ్చే ఏడాది జరిగే వేలంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వస్తే అతన్ని తన జట్టులోకి తీసుకోవడానికి ఎంతవరకైనా వెళ్తానని చెప్పేశాడు. అయితే కొంత చతురతతో వ్యాఖ్యలు చేసే ఈ 51 ఏళ్ల స్టార్ హీరో.. ధోనిని ఎలాగైనా దక్కించుకుంటానని అంటునాని.. అవసరమైతే తన పైజామాలు కూడా విక్రయించి మరీ ధోని కొనేందుకు సిద్దపడతానని చెప్పాడు షారుక్ ఖాన్.  

ధోని లాంటి కీలక ఆటగాడు వేలానికి వస్తే ఎటువంటి ఆలోచనా లేకుండా తన జట్టులోకి తీసుకుంటానని చెప్పాడు. చివరకు తన దుస్తులు అమ్మయినా సరే దక్కించుకుంటానంటూ అతనిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు షారుక్. అయితే ముందుగా ధోనిని ఐపీఎల్ వేలం పాటలోకి రానివ్వండని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ధోనిని కోల్ కతా నైట్ రైడర్స్ జెర్సీలో చూడాలనుకుంటున్నానని కూడా చెప్పశాడు. ఒకవేళ వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలోకి ధోని వస్తే మాత్రం అతన్ని ఎలాగైనా దక్కించుకుంటానంటున్నాడు షారుక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles