Thank you God for 200 T20 wickets says Harbhajan మరో మైలురాయిని అందుకున్న హర్భజన్

Harbhajan singh third indian to take 200 wickets in t20s

harbhajan 200 wickets in ipl, harbhajan t20 200 wickets, harbhajan third indian bowler, IPL 2017, Harbhajan Singh, Mumbai Indians vs Rising Pune Supergiant, Ravichandran Ashwin, Amit Mishra

Harbhajan Singh, Mumbai Indians off-spinner, is now the third Indian and the 19th overall to snare 200 T20 scalps. He achieved the feat during IPL 2017 game vs Rising Pune Supergiant.

మరో మైలురాయిని అందుకున్న హర్భజన్

Posted: 04/25/2017 07:27 PM IST
Harbhajan singh third indian to take 200 wickets in t20s

టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌ మరో ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ లో ముంబై ఇండియన్స్ తరుపున బరిలో నిలచిన భజ్జీ.. 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. వాంఖేడె మైదానంలో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ తో జరిగిన మ్యాచ్‌ లో అతడీ ఘనత సాధించాడు. రైజింగ్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్ ను బౌల్డ్ చేసిన భజ్జీ 200 వికెట్లు తన ఖతాలో వేసుకున్నాడు. స్మిత్‌ వికెట్‌ తీసిన తర్వాత భజ్జీ మైదానంలో తీవ్ర హర్షాతిరేకం వ్యక్తం చేశాడు.

టీ20ల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న మూడో బౌలర్‌ గా హర్భజన్‌ నిలిచాడు. ఓవరాల్‌గా 19వ బౌలర్‌. ఐపీఎల్‌ లో ముంబై ఇండియన్స్‌ కు ప్రాతినిథ్యం వహిస్తున్న భజ్జీ ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడి 123 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా, నార్త్‌ జోన్‌, పంజాబ్‌, సుర్రే తరపున కూడా అతడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. తనకు టీ20 వికెట్లు ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలిపాడు. అయితే స్మీత్ ను అవుట్ చేయడానే సంబరాన్ని జరుకునుందుకు కూడా కారణముంది. అంతకుముందు ఓవర్లో కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో స్మిత్‌ ఇచ్చిన క్యాచ్‌ ను హర్భజన్ వదిలేశాడు. తర్వాతే అతడే స్మిత్‌ ను అవుట్‌ చేయడంతో సంబరపడ్డాడు. ఇక అది కాస్తా తన 200 వికెట్ గా మారడం.. మరో మైలు రాయిని భజ్జీ అందుకోవడంతో హర్షం వ్యక్తం చేశాడు. టెస్టుల్లో 417, వన్డేల్లో 269 వికెట్లు భజ్జీ ఖాతాలో ఉన్న విశయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles