Irfan Pathan to join Gujarat Lions బరిలోకి ఇర్ఫాన్ పఠాన్ వచ్చేస్తున్నాడు

Irfan pathan replaces bravo in gujarat lions squad

Irfan Pathan joins gujarat lions, irfan pathan replaces dwayne bravo, Dwayne Bravo, Bravo, IPL, Gujarat lions, Delhi Daredevils

Former India all-rounder Irfan Pathan got an IPL lifeline after the struggling Gujarat Lions roped him as Dwayne Bravo's replacement.

బరిలోకి ఇర్ఫాన్ పఠాన్ వచ్చేస్తున్నాడు

Posted: 04/25/2017 09:32 PM IST
Irfan pathan replaces bravo in gujarat lions squad

సురేష్ రైనా కెప్టెన్సీలో దూసుకెళ్లున్న గుజరాత్ లయన్స్ జట్టు మరింత పదునెక్కనుంది. టీమిండియా ఆల్ రౌండర్, బరోడా పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ లో ఆ జట్ట తరపున అడనున్నాడు. అనూహ్యంగా ఆడే అవకాశం దక్కడంతో తాను బరిలో నిలుస్తున్నానని ఇప్పటికే ప్రత్యర్థులకు సందేశాన్ని పంపించాడు. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో స్థానంలో ఇర్ఫాన్‌ ను తీసుకోవాలని గుజరాత్‌ ఫ్రాంచైజీ నిర్ణయించింది. గాయం కారణంగా బ్రావో.. ఐపీఎల్‌కు దూరమైన విషయం పాఠకులకు తెలిసిందే.

తొమ్మిదేళ్ల పాటు ఐపీఎల్‌ ఆడిన ఇర్ఫాన్‌ పఠాన్‌ పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాగా, గత ఫిబ్రవిరలో జరిగిన వేలంలో మాత్రం ఇర్ఫాన్ పఠాన్ ను బిడ్డర్లు కొనుగోలు చేసుందుకు ముందుకు రాలేదు. అయితే జట్లు యాజమాన్యాలు నిరాసక్తిని చూపడంతో ఇర్పాన్ తో పాటు ఇషాంత్ కూడా వేలంలో అమ్ముడుపోలేదు. అయితే టోర్నీ ప్రారంభం కాగానే పంజాబ్ కింగ్స్ ఇషాంత్ ను తీసుకోగా, వేచి చూసిన ఇర్ఫాన్ కు కూడా చివరకు శుభవార్త అందింది. గతంలో ఇర్పాన్ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ తరపున ఆడాడు. 1137 పరుగులు చేసి, 80 వికెట్లు పడగొట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Irfan Pathan  Dwayne Bravo  Bravo  IPL  Gujarat lions  Delhi Daredevils  

Other Articles