జవగల్ శ్రీనాథ్ ను అధిగమించిన అశ్విన్ Ashwin surpasses Srinath

Ravichandran ashwin surpasses javagal srinath

india vs england, ravichandran ashwin, jawagal srinath, Chandrasekhar, 4 Wickets, england, team india, wankhede test, cricket

Indian spinner Ravichandran Ashwin has surpassed former Indian fast bowler Javagal Srinath to become the seventh highest wicket-taker for India

జవగల్ శ్రీనాథ్ ను అధిగమించిన అశ్విన్

Posted: 12/08/2016 08:31 PM IST
Ravichandran ashwin surpasses javagal srinath

ఇటీవల తనలోని బ్యాటింగ్ ప్రతిభతో అటు బ్యాట్స్ మెన్ల కూడా అవ్వాకయ్యేలా చేస్తూ అల్ రౌండ్ ప్రదర్శనను చేస్తున్న టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ముంబౌలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా జరుగుతున్న నాల్గవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఏకంగా నాలుగు వికెట్లను సాధించి.. టీమిండియా పేస్ బౌలర్ రికార్డును అధిగమించాడు.

ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ మొయిన్ అలీ వికెట్ను సాధించడం ద్వారా భారత తరపున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఏడో బౌలర్గా అశ్విన్ గుర్తింపు సాధించాడు. ఈ క్రమంలోనే భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అశ్విన్ ఓవర్ టేక్ చేయగలిగాడు. జవగళ్ శ్రీనాథ్ 67 టెస్టులు అడి 236 వికెట్లను పడగోట్టగా, అశ్విన్ కేవలం 43 టెస్టులలోనే శ్రీనాథ్ రికార్డును అధిగమించడం అతని ప్రతిభకు అద్దం పడుతుంది.

ఇటీవల ఫాస్టెస్ 200 వికెట్లను అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్గా నిలిచిన అశ్విన్.. మరో నాలుగు వికెట్లను సాధిచడంలో ఆరవ అత్యధిక వికెట్లు సాధించిన నాటి బౌలర్ బి. చంద్రశేఖర్ రికార్డును కూడా అధిగమించనున్నాడు. మరిన్నీ వికెట్లను సొంతం చేసుకుని మరింత వేగంగా వికెట్ టేకర్ గా అయన రికార్డులు సాధించాలని మనమూ అల్ ది బెస్ట్ చెబుదాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  ravichandran ashwin  jawagal srinath  england  team india  wankhede test  cricket  

Other Articles