ఫీల్డ్ అంఫైర్ పాల్ రైఫెల్ రిటైర్డ్ హర్ట్.. ఎలా..? umpire Paul Reiffel was knocked out by Bhuvneshwar Kumar

Umpire paul reiffel was knocked out by bhuvneshwar kumar

Paul Reiffel, Paul Reiffel retired hurt, Bhuvneshwar Kumar, India vs England, Mumbai Test, Virat Kohli, Jeff Crowe, Marais Erasmus, Bruce Oxenford

Umpire Paul Reiffel was ‘retired hurt’ while officiating on Day One of the fourth Test between India and England at the Wankhede Stadium

ఫీల్డ్ అంఫైర్ పాల్ రైఫెల్ రిటైర్డ్ హర్ట్.. ఎలా..?

Posted: 12/08/2016 09:33 PM IST
Umpire paul reiffel was knocked out by bhuvneshwar kumar

పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో ముంబైలోని వాంఖేడ్ స్టేడియం వేదికగా జరుగుతున్న నాల్గవ టెస్టు మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ పాల్ రైఫెల్ రిటైర్డ్హర్ట్ అయ్యాడు. అవునా.. అని సందేహాన్ని వ్యక్తం చేయకండి.. ఇది నిజంగా జరిగింది. గత రెండేళ్ల క్రితం జరిగిన దేశవాళీ క్రికెట్ లో అస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ బౌన్సర్ బంతితో గాయపడి మరణించిన ఘటనతో అలెర్ట్ అయిన అంతర్జాతీయ క్రికెట్ మండలి అంఫైర్లకు కూడా బంతులు బలంగా తగిలే ప్రమాదముందని భావించి.. వారికి అమ్ గార్డును కూడా ఇచ్చింది.

అయితే అమ్ గార్డును దరించడం అందరు అంఫైర్లకు ఇష్టం వుండదు. ఎవరో ఒకరిద్దరు అంపైర్లు మాత్రమే దీనిని ధరించి వస్తున్నారు. పాల్ రైఫెల్ కూడా ఎలాంటి గార్డ్ లేకుండా ఫీల్డ్ లోకి అందరు అంపైర్ల మాదిరిగానే వచ్చాడు. కాగా, 49 ఓవర్లోని రెండో బంతిని రవిచంద్రన్ అశ్విన్ వేయగా, ఇంగ్లండ్ ఆటగాడు జెన్నింగ్స్ దానిని లెగ్ స్టంప్ మీదుగా తరలించి సింగిల్ తీశాడు.

వారు మరో రన్ కు యత్నిస్తున్న క్రమంలో దానిని పట్టుకున్న ఫీల్డర్ భువనేశ్వర్ కుమార్ బౌలర్ వైపు బంతిని విసిరాడు. అది నేరుగా విసిరిన బంతి అంపైర్ తల వెనుక బాగాన తగిలింది. దాంతో అంపైర్ ఫీల్డ్లో పడిపోయాడు. అనంతరం ఫిజియోలో అతనికి ప్రాథమిక చికిత్స చేసిన తరువాత రైఫెల్.. గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. అతని స్థానంలో టీవీ అంపైర్ ఎరస్మస్ ఫీల్డ్ అంపైర్గా వచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  umpire  Paul Reiffel  england  team india  wankhede test  cricket  

Other Articles