Zaheer Khan leads the Delhi Daredevils pack

Pant bowlers help daredevils crush lions

Hodge concerned about powerplay failures, McCullum defies laws of physics again, Zak leads the pack, Rishabh Pant, Gujarat Lions v Delhi Daredevils at Rajkot, Indian Premier League, Delhi Daredevils cricket, Gujarat Lions cricket, India cricket, cricket photos, cricket images, cricket

Delhi Daredevils' bowlers restricted table-toppers Gujarat Lions to 149, setting up a convincing eight-wicket win in Rajkot's last game of the season.

గుజరాత్ లయన్స్ డెన్ లో గర్జించిన ఢిల్లీ డేర్ డెవిల్స్

Posted: 05/04/2016 01:03 PM IST
Pant bowlers help daredevils crush lions

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ సునాయాస విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రభాగన నిలిచిన గుజరాత్ డెన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ గర్జించింది. ఫలితంగా ఎనమిది వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్‌ ఓడి మొదటగా బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ లయన్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 150 పరుగుల విజయలక్ష్యంతో అనంతరం బ్యాటింగ్‌ బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ రెండు వికెట్ల నష్టానికి నిర్ణీత 20 ఓవర్లకు 16 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.

ఓపెనర్లు డి కాక్‌, రిషబ్‌ పాంత్‌ ఆట ప్రారంభం నుంచే రెచ్చిపోయి ఆడారు. ఓ వైపు వికెట్‌ కోల్పోకుండా జాగ్రత్తపడుతూనే ఫోర్లు, సిక్సర్లతో స్కోర్‌ను పరుగులు పెట్టించారు. ఇరువురు బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తూ మంచి భాగస్వామ్యాన్ని కనబర్చారు. అర్ధ శతకం చేసి మరింత దూకుడు పెంచుతున్న క్రమంలో రిషబ్‌ పాంత్‌ 13వ ఓవర్‌లో జడేజా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు.

అనంతరం సంజు స్యామ్సన్‌తో కలిసి డికాక్‌ స్కోర్‌ను మరింత ముందుకు తీసుకెళుతూ 46 పరుగులతో ఆఫ్‌ సెంచరీకి చేరువలో ఉండగా డ్వెయిన్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డుమిని స్యామ్సన్‌కు చక్కని జోడిగా నిలిచాడు. ఇరువురు సిక్సర్‌, ఫోర్లతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరానికి చేర్చారు. డి కాక్‌ 46(45), రిషబ్‌ పాంత్‌ 69(40), సంజు స్యామ్సన్‌ 19(13 నాటౌట్‌), డుమిని 13(7 నాటౌట్‌) పరుగులు చేశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 150 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ ఆదిలోనే బ్రెండన్ మెకల్లమ్(1), డ్వేన్ స్మిత్(15) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.అనంతరం ఆరోన్ ఫించ్(5) కూడా నిష్రమించడంతో గుజరాత్ 24 పరుగుల వద్ద మూడో వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలోసురేష్ రైనా-దినేష్ కార్తీక్ జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడీ 51 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన అనంతరం రైనా(24) నాల్గో వికెట్ గా అవుటయ్యాడు.

అయితే దినేష్ కార్తీక్(53;43 బంతుల్లో 5 ఫోర్లు) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో గుజరాత్ తేరుకుంది. ఆపై రవీంద్ర జడేజా(36 నాటౌట్; 26 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్స్) రాణించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నదీమ్ కు రెండు వికెట్లు సాధించగా, క్రిస్ మోరిస్,జహీర్ ఖాన్, మహ్మద్ షమీ, అమిత్ మిశ్రాలు తలో వికెట్ తీశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL-2016  Delhi Daredevils  Gujarat Lions  Zaheer Khan  Cricket  

Other Articles