అసియా కప్ ఆ తరువాత టీ 20 ప్రపంచకప్లో పూర్తిగా విఫలమై పాకిస్తాన్ క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయిన షాహిద్ ఆఫ్రిది.. మళ్లీ సత్తాచాటుకుని జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ జట్టులో తిరిగి స్థానం సంపాదించడమే తన ముందున్న లక్ష్యమని ఆఫ్రిది తెలిపాడు. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తానన్నాడు. వరల్డ్ టీ 20 అనంతరం పాకిస్తాన్ పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆఫ్రిది ఆ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
అయితే త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాక్ జట్టులో కూడా ఆఫ్రిదికి స్థానం కోల్పోయాడు. సోమవారం ప్రకటించిన పాక్ జట్టులో ఆఫ్రిదికి చోటు దక్కలేదు. అయితే కింది స్థాయి క్రికెట్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దృష్టి నిలపాల్సిన అవసరం ఉందంటూ ఆఫ్రిది సూచించాడు. పాకిస్తాన్ జట్టును మళ్లీ విజయతారాలకు చేర్చాలంటే క్షేత్రస్థాయిలో పరిశీలను, మార్పులు జరగాల్సిన అవసరం వుందని అఫ్రీది అభిప్రాయపడ్డాడు. కిందిస్థాయి నుంచి జట్టును పటిష్టపరిస్తేనే పాకిస్తాన్ క్రికెట్ మెరుగుపడుతుందని అశాభావం వ్యక్తం చేశాడు.
దేశవాళీ క్రికెట్పై పీసీబీ మరింత దృష్టి సారించాల్సి వుందని సూచించిన ఆయన.. ప్రత్యేకంగా కింది స్థాయి నుంచి పాక్ క్రికెట్ ను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. బాల్య వ్యవస్థ నుంచే మెరుగ్గా అడుతున్న పాఠశాల విద్యార్థులను మెరుగైన శిక్షణను అందిస్తూ వారిని మెరికల్లా తయారు చేయాల్సిన అవసరం వుందన్నాడు. ప్రధానంగా స్కూల్ క్రికెట్ పై ఫోకస్ చేయాలని పేర్కోన్నాడు. తాను చూసినంత వరకూ పాకిస్తాన్ క్రికెట్ వెనుక బలం కూడా పెద్దగా లేదు. దీర్ఘ కాలిక ప్రయోజనాల దృష్ట్యా సాధ్యమైనంత వరకూ ఎక్కువ దృష్టి స్కూల్ క్రికెట్ పై నిలపాలి'అని ఆఫ్రిది విజ్ఞప్తి చేశాడు.
జి, మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more