India tour of Zimbabwe 2016: Men in Blue to play three ODIs and three T20Is

Zimbabwe to host india for three odis and three t20s

India Tour of Zimbabwe 2016,India Tour of Zimbabwe,India vs Zimbabwe,Harare,ODI Series,t20i series,india vs zimbabwe 2016,MS Dhoni,India Cricket Schedule 2016,Zimbabwe Cricket

Zimbabwe are set to host India for three ODIs and three T20s in June at the Harare Sports Club. The six matches will be played over 12 days, starting with the first ODI on June 11 and the last T20 on June 22

ఐపీఎల్ ముగియగానే భారత్ జింబాబ్వే పర్యటన.

Posted: 05/04/2016 12:56 PM IST
Zimbabwe to host india for three odis and three t20s

ఆసియా కప్, ఆ వెంటనే వరల్డ్ టీ 20 టోర్నమెంటులో పాల్గొన్న టీమిండియాకు ఉపిరి సల్పనీయని బిజీ షెడ్యూల్డు ముంగిటికి చేరింది. వరల్డ్ టీ 20 ముగియగానే ఐపీఎల్ తో తలమునకలైన టీమిండియా క్రికెటర్లకు ఇది కాస్త మింగుడుపడని వార్తే. ఎందుకంటే ఐపిఎల్ ముగిసిందనగానే వారు జింబాబ్వే పర్యటను వెళ్లాల్సివుంది. అయితే కాస్త ఉపశమనం మాత్రం లభించనుంది. మే 29న జరగనున్న ఫైనల్ మ్యాచ్ తో ఐపీఎల్ సందడి ముగిసిముగియగానే జూన్ 11 నుంచి జింబాబ్వేలో వన్డే సీరిస్ లు ప్రారంభం కానున్నాయి.

ఇందుకోసం జింబాబ్వే వచ్చే నెల 6 లేదా 7న జింబాబ్వేకు బయలుదేరి వెళ్లనుంది. దీంతో టీమిండియా బ్యాట్స్ మెన్లకు కేవలం వారం రోజుల స్వల్ప విరామం మాత్రమే లభించనుంది. అందులోనూ టీమిండియా జట్టులో ముఖ్యంగా పెళ్లైన యువకులతో నిండివుండటంతో.. ఎవరెవరు ఈ పర్యటనలకు వెళ్లనున్నారో వేచి చూడాల్సిందే. రవింద్రా జడేజా, సురేష్ రైనా, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్ తదితర ఆటగాళ్లందరూ ఇటీవలే ఇంటివాళ్లైన విషయం తెలిసిందే. కాగా బిసిసిఐ ఈ పర్యటనకు ఎవరెవరిని ఎంపిక చేస్తుందన్నది కూడా తెలియాల్సి వుంది.

ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా భారత్ మూడు వన్డే మ్యాచ్లు, మూడు టీ 20లు ఆడనున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు మంగళవారం స్పష్టం చేసింది.  ఇరు జట్ల మధ్య జూన్ 11 నుంచి 15 వరకూ వన్డే సిరీస్, 18 వ తేదీ నుంచి 22 వరకూ టీ 20 సిరీస్ జరుగనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ హరారే స్పోర్ట్ క్లబ్ లో స్టేడియంలో  నిర్వహించనున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ విల్ ఫ్రెడ్ ముకొందివా పేర్కొన్నారు. 'భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనపై సంతోషంగా ఉన్నాం. భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ)తో అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి'అని విల్ ఫ్రెడ్ తెలిపారు. 2010 నుంచి 2015 వరకూ భారత్ మూడు సార్లు జింబాబ్వే పర్యటను వెళ్లిన సంగతి తెలిసిందే.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  India  zimbamwe  Ind vs zim  zim vs ind  india tour of zimbamwe  

Other Articles