Grateful to KKR think-tank for faith in me: Yusuf Pathan

Grateful to kkr think tank for faith in me says yusuf pathan

India, Indian Premier League, Indian Premier League 2016, IPL, IPL 2016, Kolkata Knight Riders, Yusuf Pathan, Jacques Kallis, Simon Katich, Royal Challengers Bangalore, Kohli, Uthappa IPL, cricket, IPL 9, Cricket latest IPL 9 news

Hard-hitting Kolkata Knight Riders (KKR) batsman Yusuf Pathan has thanked the team's head coach Jacques Kallis and his assistant Simon Katich for reposing faith in him and giving him the opportunity to bat for nearly half the innings.

నమ్మకం ఉంచిన జట్లు కోచ్ లకు పఠాన్ కృతజ్ఞతలు

Posted: 05/04/2016 11:53 AM IST
Grateful to kkr think tank for faith in me says yusuf pathan

చాలా రోజులుగా ఫామ్ లేక ఇబ్బందులు పడి.. ఇటీవల బెంగుళూరుపై తన విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి తన సత్తాను చాటిన కోల్కతా నైట్రైడర్స్ బ్యాట్స్మన్ యూసుఫ్ పఠాన్.. తనపై నమ్మకం ఉంచి, రాణించడానికి తోడ్పడిన టీమ్ హెడ్ కోచ్ జాక్వెస్ కలిస్, అసిస్టెంట్ కోచ్ సిమోన్ కటిచ్లకు ధన్యవాదాలు చెబుతున్నాడు. తనపై విశ్వాసం ఉంచి, మధ్య ఓవర్లలో ఆడే అవకాశం ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా విజయం సాధించడంలో యూసుఫ్ కీలకపాత్ర పోషించాడు.

యూసుఫ్ 29 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలవడంతో కోల్కతా మరో ఐదు బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లతో తేడాతో విజయతీరాలను అందుకుంది. ఈ విజయం గురించి యూసుఫ్ మాట్లాడుతూ.. 'ఇన్నింగ్స్లో మరో రెండు లేదా మూడు ఓవర్లు మిగిలివున్నపుడు వెళ్లి బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ప్రతి బంతికి భారీ షాట్లు ఆడాల్సి ఉంటుంది. నిలకడగా ఆడే పరిస్థితి ఉండదు. బెంగళూరుతో మ్యాచ్లో ఇంకా పది ఓవర్లు ఉన్నప్పుడు నన్ను బ్యాటింగ్కు పంపారు. దాంతోనే తన పని సులువైందని ఆయన చెప్పుకోచ్చారు.

నాపై నమ్మకం ఉంచి, అవకాశం ఇచ్చిన కలిస్, కటిచ్లకు కృతజ్ఞతలు' అని చెప్పాడు. కోల్కతా కెప్టెన్ గంభీర్ గురించి మాట్లాడుతూ.. అతను మంచి కెప్టెన్ అంటూ కితాబిచ్చాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గంభీర్ ఆటగాళ్లకు అండగా ఉంటూ, ప్రోత్సహిస్తాడని చెప్పాడు. కాగా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. గవాస్కర్ వ్యాఖ్యాలు, ఆయన ఏ కోణంలో ఆలోచించి, బెంగళూరు బౌలర్ల పేలవ ప్రదర్శన అని వ్యాఖ్యానించారో తనకు తెలియదని, అయితే వారు పేలవ ప్రధర్శన మాత్రం ఇవ్వలేదని పఠాన్ చెప్పాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2016  Kolkata Knight Riders  Yusuf Pathan  Jacques Kallis  Simon Katich  

Other Articles