Virat nominated for Khel Ratna, Ajinkya for Arjuna by BCCI

Bcci recommends kohli for khel ratna rahane for arjuna

Rajjiv Khel Ratna award, virat kohli, ajinkya rahane, Arjuna Award, BCCI, Cricket, kohli rajiv khel ratna, rahane arjuna award, virat kohli, virat kohli nominated, ajinkya rahane, kohli india, rahane india, rajiv gandhi khel ratna, arjuna award, cricket photos, cricket images, cricket

If Virat Kohli wins Rajiv Gandhi Khel Ratna Award, he would be third cricketer after Sachin Tendulkar and the Mahendra Singh Dhoni to win the award.

కోహ్లీ, రహానేలకు మరో అరుదైన గౌరవం.. పురస్కారాలకు బిసిసిఐ సిఫార్సు

Posted: 05/03/2016 07:02 PM IST
Bcci recommends kohli for khel ratna rahane for arjuna

టీమిండియా టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్య రహనేల పేర్లు అత్యుత్తమ పురస్కారాలకు సిఫార్సు చేయబడ్డాయి. ఈ ఏడాది స్వతంత్ర్య దినోత్సవ వేడుకులకు సందర్భంగా ఈ పురస్కారలు ఈ క్రీడాకారులకు అందించాల్సిందిగా బిసిసిఐ సిఫార్సు చేయనుంది. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు అందజేసే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డుల ఎంపిక సిఫార్సులను (బోర్డు ఆప్ కంట్రోల్ ఫర్ ఇండియన్ క్రికెట్) బీసీసీఐ మొదలుపెట్టింది. 2015 సంవత్సరానికి గానూ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును సిఫార్సు చేయనుంది.

అలాగే అర్జున అవార్డు కోసం క్లాస్ ఆటగాడు అజింక్యా రహానే పేరును బీసీసీఐ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి తమ సిఫార్సు నివేదికను అందించింది. కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఈ మేరకు తుది నిర్ణయం తీసుకుని అవార్డులకు ఆయా వ్యక్తులను ఎంపిక చేస్తుంది. అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న’  అవార్డు పతకం, సర్టిఫికెట్‌తో పాటు ఏడున్నర లక్షల నగదును ఇస్తారు. ‘అర్జున’  అవార్డు కింద జ్ఞాపిక, సర్టిఫికెట్, 5 లక్షల నగదును క్రీడాకారులకు అందజేస్తారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajiv Khel Ratna award  virat kohli  ajinkya rahane  Arjuna Award  BCCI  Cricket  

Other Articles