Sri lanka crush england by 9 wickets

england versus srilanka match, england vs srilanka, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, England, England CWC 2015, Live Scores, Live Updates, srilanka, srilanka CWC 2015, Sports, World Cup Live

Tons from Kumar Sangakkara and Lahiru Thirimanne help Sri Lanka crush England by 9 wickets

శ్రీలంక అద్భుత భాగస్వామ్యం.. ఇంగ్లాండ్ పై విజయం

Posted: 03/01/2015 06:52 PM IST
Sri lanka crush england by 9 wickets

ప్రపంచ క్రికెట్ టార్నమెంట్ ప్రపంచకప్‌లో భాగంగా పూల్ ఏలో శ్రీలంక ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్‌పై శ్రీలంక ఘన విజయం సాధించింది. అద్భుతమైన భాగస్వామ్యంతో రాణించిన లంకేయులు ఇంగ్లాండ్ పై తొమ్మిది విక్కెట్ల తేడాతో గెలుపొందారు. 310 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. తిరిమన్నె (139 నాటౌట్), సంగక్కర (117 నాటౌట్) శతకాలతో రాణించడంతో మరో 16 బంతులు మిగిలి ఉండగానే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 312 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.

శ్రీలంక 310 పరుగుల లక్ష్య ఛేదనలో ఎక్కడా ఒత్తడికి లోను కాకుండా రాణించారు. ఓపెనర్లు దిల్షాన్, తిరిమన్నెలు తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం అందించిన తరువాత దిల్షాన్ (44) ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంగక్కర ఆది నుంచే దూకుడైన ఆటతీరుతో స్కోరు పెంచడంపై దృష్టి సారించాడు. మరోవైపు తిరిమన్నె స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ 117 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్స్ తో సెంచరీ పూర్తి  చేసుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడిన సంగక్కర కేవలం 70 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్స్ లతో సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీలు పూర్తి చేసిన తరువాత ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి భారీ షాట్లు ఆడింది. ఈ క్రమంలోనే రెండో వికెట్‌కు అజేయంగా 212 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు ఓపెనర్ల నుంచి 62 పరుగుల శుభారంభం లభించింది. ఓపెనర్ బెల్ (49) తృటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రూట్ ఆది నుంచి నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలోనే రూట్ 100 బంతుల్లో పదకొండు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 100 పరుగులు చేశాడు. శతకం అనంతరం రూట్ చెలరేగి ఆడుతూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ 121 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెరాత్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. టేలర్‌తో కలిసి రూట్ ఐదో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో బట్లర్ 19 బంతుల్లో 39 పరుగులు సాధించి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. శ్రీలంక బౌలర్లలో మలింగ, లక్మల్, మాథ్యూస్, దిల్షాన్, హెరాత్, పెరీరా తలో వికెట్ తీశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  england  srilanka  

Other Articles