Sangakkara s number one says thirimanne

srilanka won against ebgland, srilanka won the match against england, ICC Cricket World Cup 2015, srilanka versus afghanistan, srilanka vs afghanistan, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, virat kohli, Cricket, CWC 2015, england CWC 2015, Live Scores, Live Updates, srilanka, srilanka cwc 2015, Sports, World Cup Live, Lahiru Thirimanne, Kumar Sangakkara

Sri Lanka's Lahiru Thirimanne today declared teammate Kumar Sangakkara one of the best limited overs batsmen of all time after his second successive century at the World Cup.

అతనే నెంబర్ వన్ ఆటగాడు..

Posted: 03/01/2015 08:12 PM IST
Sangakkara s number one says thirimanne

పరిమిత ఓవర్ల క్రికెట్ లో కుమార సంగక్కరను మించినవాడు లేడంటూ శ్రీలంక బ్యాట్స్ మన్ లాహిరు తిరిమన్నె ఆకాశానికెత్తాడు. అత్యుత్తమ ఆటగాళ్లలో అతడొక్కడని కితాబిచ్చాడు. వరుసగా రెండు మ్యాచుల్లో సంగక్కర రెండు సెంచరీలు సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో సంగక్కర(117) సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. 402 వన్డే మ్యాచులు ఆడిన సంగక్కర ఇప్పటివరకు 24 సెంచరీలు సాధించాడని తిరిమన్నె శ్లాఘించాడు.

ఎంతో అనుభవం ఉన్న సంగక్కర జట్టును ప్రభావితం చేయగలడని తిరిమన్నె అన్నాడు. అతడు నంబర్ వన్ ఆటగాడని, అతని బ్యాటింగ్ చాలా బాగుంటుందని ప్రశంసించాడు. స్ట్రైక్ రొటేట్ చేయడమే కాకుండా బౌండరీలు బాదడంలోనూ దిట్టని తెలిపాడు. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ తిరిమన్నె(139) కూడా అజేయ శతకం బాదాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ నుంచి లంకేయులు ఫామ్ లోకి రావడం, క్వార్టర్ ఫైనల్స్ వెళ్లేందుకు రమారమి అవకాశాలను మెరుగుపర్చుకున్న నేపథ్యంలో తిరిమన్నే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి

 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  srilanka  Lahiru Thirimanne  Kumar Sangakkara  

Other Articles