US Open 2015 doubles delight for India: Sania Mirza, Leander Paes in finals

Sania mirza martina hingis reach us open 2015 final

us open 2015, us open, sania mirza, sania mirza us open, sania mirza india, leander paes, saina leander paes, sania, martina in finals, Martina Hingis, sania into us open doubles final, sania into us open mixed doubles final, tennis news, tennis

Sania Mirza and Leander Paes stormed into doubles and mixed doubles finals with common partner Martina Hingis.

యూఎస్ ఓపెన్ డబుల్స్, మిక్సడ్ డబుల్స్ ఫైనల్లోకి సానియా జోడి

Posted: 09/10/2015 05:57 PM IST
Sania mirza martina hingis reach us open 2015 final

భారత టెన్నిస్ అభిమానులకు డబుల్ బోనాంజా అందించేందుకు మన క్రీడాకారులు సిద్దంగా వున్నారు. ప్రపంచ మహిళల డబుల్స్ నెంబర్ వన్ రాంకర్, భారత స్టార్ షెట్లర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా సహా లీయాండర్ పేస్ జోడీలు ఒకే టోర్నమెంటులో రెండు టైటిళ్లను సాధించేందుకు సమాయత్తం అవుతున్నాయి. న్యూయార్క్ లో జరుగుతున్న యూఎస్ ఓపెన్ లో ఈ ఫీటును సాధించేందుకు సానియా, పేస్ జోడీలు మరో అడుగు దూరంలో వున్నాయి. మహిళల డబుల్స్ లో సానియా మిర్జా, మార్టినా హింగిస్ జోడీ ఫైనల్స్ లోకి వెళ్లగా, మిక్సడ్ డబుల్స్ లో లియాండర్ పేస్, మార్టినా హింగిస్ జోడి ఫైనల్ కు చేరడంతో ఈ అరుదైన ఫీటు సాధించే అవకాశాలున్నాయి.

ఇవాళ జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సానియా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం 6-4, 6-1 తేడాతో ఇటలీకి చెందిన 11వ సీడ్ జోడీ సారా ఎరాని - పెనెట్టాపై విజయం సాధించింది. రెండు సెట్లలోనే మ్యాచ్ ముగించి దిగ్విజయంగా ఈ జోడీ ఫైన్లల్లోకి దూసుకెళ్లింది. తొలి సెట్లో కాస్తంతా పోరాటం చేసిన ఎరానా - పెనెట్టా జోడీ రెండో సెట్లో పూర్తిగా చతికిలబడింది. అటు ప్రపంచ నాల్గవ సీడ్ ప్లేయర్లు లాయండర్ పేస్, మార్టినా హింగిస్ లు తాజాగా జరిగిన మ్యాచ్ లో మరో భారత ఆటగాడు సెకండ్ సీడ్ ఆటగాడు రోహన్ బోప్పన్నా, చైనా క్రీడాకారిణి చైనీస్ తైపీని 6-2, 7-5తో ఓడించారు. ఇరు జట్లు నాలుగు ఏస్ లను సర్వ్ చేసినా.. బోప్పనా, చాన్ జోడీ తప్పిదాల కారణంగానే లియాండర్ పేస్, హింగీస్ జోడీ గెలుపోందింది. ఫైనల్స్ లో ఈ ఇండో-స్విస్ జోడీ అమెరీకన్ జోడీ బితేనీ మాటెక్ సాండ్స్, సామ్ క్వారేలతో తలపడనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina mirza  leander paes  martina Hingis  US open doubles  us open mixed doubles final  

Other Articles