Sania Mirza slams man for saying she's no longer Indian నెట్ జనుడికి సానియా మైండ్ బ్లాక్ జవాబు..

Sania mirza shuts down twitter troll for calling her non indian

sania mirza, mirza, sania mirza nationality, kathua gangrape, sania mirza tweets, nationality, sports news, twitterites

Indian Tennis star Sania Mirza gave a tough reply to the person who questioned her nationality. The 31-year-old tweeted I am Indian and always will be.. nd maybe if u look beyond religion and country one day you may just also stand for humanity!”.

నెట్ జనుడికి సానియా మైండ్ బ్లాక్ జవాబు..

Posted: 04/13/2018 04:54 PM IST
Sania mirza shuts down twitter troll for calling her non indian

పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడి ఎనమిది వసంతాలు పూర్తి చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఓ వ్యక్తి నీ దేశం ఏదీ అంటూ ప్రశ్నించి.. అమె అగ్రహానికి గురయ్యాడు. అంతేకాదు నెట్టింట్లో తన మర్యాదను, గౌరవాన్ని కూడా పొగొట్టుకున్నాడు. అతని ప్రశ్నకు తాను ఎప్పటికీ భారతీయురాలినేననీ.. భారత్ కోసమే ఆడతానని స్పష్టం చేసిన సానియా.. ఇంతలా స్పందించడానికి కారణమేంటీ..? అంటారా..?.. కాశ్మీర్ లో ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి ప్రాణాలు తీయడంపై ఇటీవల సానియా మీర్జా ట్విటర్లో స్పందిస్తూ... ‘‘ప్రపంచానికి మనం చూపించాలనుకుంటున్నది నిజంగా ఇలాంటి దేశాన్నేనా? కుల, మత, వర్ణ, ప్రాంతాలకు అతీతంగా మనం ఈ 8 ఏళ్ల బాలిక తరపున నిలబడకపోతే... ప్రపంచంలో ఇక దేనికీ అండగా నిలబడనట్టే. అది మానవత్వం అని కూడా అనిపించుకోదు.. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది...’’ అని పేర్కొంది.
 
సానియా ట్వీట్‌పై ఓ నెటిజన్ స్పందిస్తూ ఆమె జాతీయతను ప్రశ్నించాడు. ‘‘ మేడం.. మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారు. మీరు పాకిస్తాన్ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక మీరు ఏమాత్రం ఇండియన్ కాదు. ఒక వేళ మీరు ట్వీట్ చేయాలనుకుంటే పాకిస్తాన్ ఉగ్రమూకలు చంపుతున్న అమాయకులపై కూడా ట్వీట్ చేయండి..’’ అని పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలపై సానియా కూడా అంతే స్థాయిలో ఘాటుగా స్పందించింది. ‘‘అన్నిటికంటే మొదటిది... ఓ వ్యక్తి ఏదేశం వారినైనా వివాహం చేసుకోవచ్చు. రెండోది.. నేను ఏ దేశస్తురాలినో నీలాంటి అథమ స్థాయి వ్యక్తులు చెప్పక్కర్లేదు. నేను భారత దేశం కోసమే ఆడతాను. నేను ఇప్పటికీ ఎప్పటికీ భారతీయురాలిగానే ఉంటాను. ఒకవేళ నువ్వు దేశం, మతాలకు అతీతంగా ఆలోచించగలిగితే... ఒకనాటికి మానవత్వం వైపు కూడా నిలబడతావు...’’ అంటూ సుతిమెత్తగా చురకలు వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Doubts turn to desperation after andy murray s lost six months

    అండీ ముర్రేకు గాయాలు.. అభిమానల అందోళన

    Jan 05 | బ్రిటన్‌ స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌, ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌, 3సార్లు గ్రాండ్‌ స్లామ్‌ ఛాంపియన్‌ ఆండీ ముర్రే కెరీర్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన ముర్రే గాయం... Read more

  • China open simona halep seals landmark win over maria sharapova

    చైనా ఓపెన్ నుంచి షరపోవా ఔట్..

    Oct 04 | చైనా ఓపెన్ లో రష్యా టెన్నిస్ క్వీన్, మాజీ నెంబర్ వన్ మరియా షరపోవాకు చుక్కెదురైంది. డోపింగ్ ఆరోపణలతో 15 నెలల నిషేధం తర్వాత ఆడిన ప్రతి టోర్నమెంట్లో ఏదో ఓ దశలో ఇంటిబాట... Read more

  • Us open champion sloane stephens freaks out over bug in hilarious video

    ప్రెస్ మీట్ లో బూటు చూపించిన ఛాంపియన్

    Sep 11 | యూఎస్ ఓపెన్ టోర్నీలో పాల్గోని తొలిసారి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన మరో నల్లకలువ బామ, అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి స్లోవానే స్టీఫెన్స్ మ్యాచ్ గెలిచిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో.. తన కాలి... Read more

  • Bopanna dabrowski clinch french open mixed doubles title

    ఫ్రెంచ్‌ ఓపెన్‌ తో తొలిబోణీ కొట్టిన బోపన్న

    Jun 08 | భారత స్టార్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న ఎట్టకేలకు తొలిబోణి కొట్టాడు. ఇన్నాళ తన కెరిర్‌లో ఆయనను తీరని ఆశగా వున్న స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. తొలి గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో... Read more

  • Rohan bopanna and marcin matkowski march into semi finals

    దుబాయ్ ఓపెన్: సెమీస్ లోకి దూసుకెళ్లిన బొప్పన్న జోడి

    Mar 02 | దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్‌ నంబర్‌వన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న సత్తాచాటాడు. దుబాయ్ లో జరుగుతున్న ఈ ఛాంపియన్ షిప్ లో క్వార్టర్ ఫైనల్ లోకి దూసుకెళ్లిన బోప్పన్న టైటిల్... Read more

Today on Telugu Wishesh