Venus and Serena: They're all grown up and still got each other's back

Sania mirza martina hingis cruise into us open 2015 semis

us open 2015, sania mirza, martina hingis, sania mirza us open, sania mirza us open, martina hingis sania mirza, sania mirza martina hingis, sania mirza martina hingis match, sania mirza martina hingis 2015, sania hingis us open, sania hingis us open 2015, martina hingis, hingis us open, hingis sania us open, serena williams, venus williams

US Open 2015: Sania Mirza and Martina Hingis converted all the four breakpoints they earned and lost their serve twice to their ninth seed opponents.

యూఎస్ ఓపెన్ సెమీస్ లోకి సానియా జోడి

Posted: 09/09/2015 06:08 PM IST
Sania mirza martina hingis cruise into us open 2015 semis

భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. మార్టినా హింగిస్ తో కలసి ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లో అడుగు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో తైపీకి యంగ్ జాన్ చాన్-చింగ్ చాన్ జోడిపై 7-6(5) 6-1 తేడాతో ఓడించారు. 85 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సానియా-హింగిస్ నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించారు. సెమీఫైనల్లో ఇటాలీకి చెందిన సారా ఎరానీ- ఫ్లవియా పెనెట్టా జోడితో వీరిద్దరూ తలపడతారు.

మరోవైపు యూఎస్ ఓపెన్ లో తనకన్న పెద్దదైన సోదరి అక్క వీనస్ విలియమ్స్పై మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది సెరీనా విలియమ్స్. న్యూయార్క్ వేదికగా జరుగుతోన్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2015లో వీనస్ పై మ్యాచ్ గెలిచిన సెరీనా సెమీస్ లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో సెరీనా.. 6-2, 1-6, 6-3 తేడాతో వీనస్ పై నెగ్గింది. తొలిసెట్ లో వెనుకబడ్డ వీనస్ మలి సెట్ లో విజృంభించినప్పటికీ నిర్ణయాత్మక మూడో సెట్ లో చతికిలపడింది. దీంతో అక్కపై తన విజయాల రికార్డును (16-11) మరింత పదిలపర్చుకుంది సెరీనా.. గురువారం జరగనున్న సెమీఫైనల్స్లో ఇటాలియన్ దిగ్గజం రొబెర్టా విన్సీతో తలపడనుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza  martina Hingis  US open  serena williams  venus williams  

Other Articles