I play for myself, my country and family: Sania Mirza

Sania mirza martina hingis won us open 2015 final

us open 2015, us open, sania mirza, sania mirza us open, Sania Mirza,Sania Mirza reaches India,Sania Mirza reach Hyderabad,Sania Mirza sister's engagement,HN Girisha,Sania Mirza US Open doubles,Number one in doubles,Sania Mirza thanks fans for love and support,Rajiv Gandhi Khel Ratna Award, tennis news, tennis

Indian tennis ace Sania Mirza on Tuesday returned to Hyderabad to a huge welcome after winning yet another women's doubles title.

యూఎస్ ఓపెన్ విజయం దేశ ప్రజలకు అంకితం: సానియా మిర్జా

Posted: 09/15/2015 03:57 PM IST
Sania mirza martina hingis won us open 2015 final

భారత టెన్నిస్ అభిమానులకు డబుల్ బోనాంజా అందించిన మన స్టార్ క్రీడాకారులు ఇవాళ స్వదేశానికి తిరిగివచ్చారు. ప్రపంచ మహిళల డబుల్స్ నెంబర్ వన్ రాంకర్, భారత స్టార్ షెట్లర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా సహా లీయాండర్ పేస్లు యూఎస్ టోర్నమెంటులో డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ రెండు టైటిళ్లను సాధించి.. సగర్వంగా స్వదేశానికి తిరిగివచ్చారు. న్యూయార్క్ లో జరుగిన యూఎస్ ఓపెన్ లో ఈ ఫీటును సాధించిన సానియా, పేస్ లకు టెన్నీస్ అభిమానులు ఘనంగా స్వాగతాలు పలికారు. కాగా ఈ విజయాలను సాధించడంలో వీరిద్దరికీ జోడీగా వ్యవహరించింది మాత్రంం స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్. దీంతో ఇండో స్వీస్ జోడీ తిరుగులేదనన్న అభిప్రాయానికి భారత టెన్నిస్ అభిమానులు వచ్చారు.

తాను సాధించిన యూఎస్‌ ఓపెన్‌ విజయాన్ని దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నానని టెన్నిస్‌స్టార్‌ సానియామీర్జా చెప్పారు. హైదరాబాద్‌కు చేరుకున్న సానియామీర్జాకు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆమె కుటుంబసభ్యులు, మిత్రులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె తన యూఎస్‌ ఓపెన్‌ టైటిల్ ను దేశప్రజలకు అంకితమిస్తున్నట్లు వెల్లడించారు. యూఎస్ ఓపెన్ గెలవడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఈ సంవత్సరం తనకు అద్భుతంగా ఉందని సానియామీర్జా పేర్కొన్నారు. ఇటీవలే క్రీడాకారులకు లభించే అత్యుత్తమ క్రీడాపురస్కారాన్ని పోందిన సానియా.. తన ఖాతాలో యూఎస్ ఓపెన్ ను కూడా వేసుకోవడం పట్ల టెన్నీస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina mirza  martina Hingis  us open mixed doubles title  people of country  

Other Articles