Sabine Lisicki sets world record of 27 aces in a tennis match

Sabine lisicki fires record 27 aces

Sabine Lisicki, Tennis Sabine Lisicki Fires Record 27 Aces, German tennis, Sabine Lisicki, world record, 27 aces, Aegon Classic, Sabine Lisicki, German tennis player, world record, WTA record, latest Tennis news

Former Wimbledon finalist Lisicki hit 16 aces in the first set and 11 more in the second set to enter the record books for most aces in one match.

ప్రపంచ రికార్డు నెలకొల్పిన జర్మనీ టెన్నిస్ స్టార్

Posted: 06/18/2015 08:19 PM IST
Sabine lisicki fires record 27 aces

జర్మనీ టెన్నిస్ స్టార్ సబీనె లిసికీ ప్రపంచ రికార్డు సృష్టించింది. మహిళల సింగిల్స్ మ్యాచ్లో అత్యధిక ఏస్లు (27) సంధించిన క్రీడాకారిణిగా లిసికీ ఘనత సాధించింది. ఏగాన్ క్లాసిక్ టోర్నమెంట్లో బెలిందా బెన్సిక్ (స్విట్జర్లాండ్)తో జరిగిన రెండో రౌండ్లో లిసికీ 27 ఏస్లు సంధించింది. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్, కయా కనేపి (ఈస్తోనియా)ల పేరిట ఉన్న సంయుక్తగా రికార్డును (24) బద్దలుకొట్టింది.

లిసికీ తొలి సెట్లో 16, రెండో సెట్లో 11 ఏస్లు నమోదు చేసింది. ఈ మ్యాచ్లో జర్మనీ స్టార్ 6-1, 7-6 (7-4) స్కోరు తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన అనంతర అమె మీడియాతో మాట్లాడుతూ గ్రౌండ్ లో గడ్డి వుండటం తనకు కలసి వచ్చిందని పేర్కోంది. గడ్డి మొలచిన గ్రౌండ్ పై ఆడటం తనకు చాల ఇష్టమని తెలిపింది. గడ్డి వుండటమే తనకు ఆయుధంలా లాభించిందని కూడా నిర్మోహమాటంగా చేప్పేసింది ఈ జర్మనీ టెన్నిస్ స్టార్.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : German tennis  Sabine Lisicki  world record  27 aces  

Other Articles