boris becker in fancy dress to avoid fans

Boris becker in fancy dress

boris becker in fancy dress to avoid fans, wimbledon 1985 title, Boris Becker, cuts, suave, figure, camel, coat, dark, glasses, heads, Mayfair, Wimbledon, Fancy Dress, boris becker, fancy dress, german tennis star, Former World number one, West London, tennis champion turned coach, Celebrities, Entertainment

german tennis star boris becker in fancy dress to avoid fans after winnig wimbledon 1985 title

అభిమానుల తాకిడి నుంచి తప్పించుకునేందుకు ఇలా..

Posted: 06/14/2015 06:27 PM IST
Boris becker in fancy dress

పాప్‌స్టార్ తరహాలో ఫోజులిస్తున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టగలరా..? మీ వల్ల కాదని మాకు తెలుసు. అయితే మీ తల్లిదండ్రులు ఏమైనా గుర్తుపట్టగలరేమో అడగండీ.. నాకు తెలుసు కొందరు గుర్తు పట్టగలరు కానీ అందరూ కాదు. ఎందుకంటే అప్పట్లో టెన్నీస్ గురించి తెలిసిన వారు అంతగా లేరు కాబట్టి. అయితే టెన్నిస్ క్రీడాభిమానులు కూడా కాస్త ఆలోచిస్తారేమో! ఎందుకంటే ఇది దాదాపు మూడు దశాబ్దాలనాటి చిత్రం. ఆ విషయాన్ని పక్కన బెట్టి ఇంతకీ ఈ ఫోటోలో వున్నదెవరో చెప్పండీ అంటున్నారుగా, అక్కడికే వస్తున్నాం. ఆయన ఒకనాటి ప్రపంచ నెంబర్ వన్ టెన్నీస్ అటగాడు.బోరిస్ బెకర్. 1985లో బెకర్ 17 ఏళ్ల వయసులో వింబుల్డన్ గెలిచి సంచనలం సృష్టించిన తర్వాత తీసిన ఫోటో ఇది.

ఈ గెలుపుతో ప్రపంచవ్యాప్తంగా హాట్‌స్టార్‌గా మారిపోయిన బెకర్ అభిమానులనుంచి తప్పించుకునేందుకు అలా చేయాల్సి వచ్చింది. నాడు స్వదేశం జర్మనీలో అయితే బెకర్ అంటే ఒక రకమైన పిచ్చి, క్రేజ్!  వింబుల్డన్ విజయానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అతను నాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. వింబుల్డన్ విజయంతో ఎక్కడకు వెళ్లినా జనం చుట్టుముట్టడంతో ఇలా అయితే స్వేచ్ఛగా తిరగలేనని భావించి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్సీ షాప్‌కు వెళ్లి కొత్త రకం డ్రెస్‌ను, రింగుల జుట్టు గల విగ్‌ను కొనుక్కున్నాడు. అలా వేసుకున్నప్పుడు తీసుకుందే ఈ ఫోటో. అయితే ఇంతా చేసినా కొంత మంది గుర్తు పట్టేసి మీద పడిపోయారట

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wimbledon  Fancy Dress  boris becker  

Other Articles